రష్మిక 2025లోనూ మ్యాజిక్ చేస్తుందా?
ఇక ఇదే హవాని కొనసాగిస్తూ రష్మిక నంటించిన `చావా` కూడా రూ.800 కోట్లు రాబట్టడం విశేషం.
By: Tupaki Desk | 9 Jun 2025 1:30 PM ISTతెలుగులో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న గత ఏడాది వరుసగా భారీ బ్లాక్ బస్టర్లని దక్కించుకుని హీరోయిన్‌గా పాన్ ఇండియా సినిమాలతో సరికొత్త రికార్డుల్ని సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప 2` వరల్డ్ వైడ్‌గా ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ దాదాపుగా రూ.1800 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇక ఇదే హవాని కొనసాగిస్తూ రష్మిక నంటించిన `చావా` కూడా రూ.800 కోట్లు రాబట్టడం విశేషం. విక్కీ కౌశల్ హీరోగా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు నమోదు చేసి రష్మిక కెరీర్‌లో తిరుగులేని సినిమాగా నిలిచింది. ఈ రెండు పాన్ ఇండియా సక్సెస్‌ల తరువాత రష్మిక `సింకిందర్`తోనూ ఇదే ఫీట్‌ని రిపీట్ చేస్తుందని అంతా భావించారు కానీ అది జరగలేదు. సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉంవటే 2025లో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో ముందుగా రిలీజ్ అవుతున్న మూవీ `కుబేర`. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే అంచనాలు నెలకొన్న ఈ మూవీ జూన్ 20న పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీనిపై రష్మిక భారీ అంచనాలే పెట్టుకుంది. దీని తరువాత రష్మిక మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తోంది. అదే `థామ`. స్త్రీ, ముంజ్యా, స్త్రీ 2 వంటి బ్లాక్ బస్టర్లని అందించిన మడోక్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే రొమాంటిక్ కామెడీ ఇది. `ముంజ్యా`కు దర్శకత్వం వహించిన ఆదిత్య సర్పోట్తార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా `స్త్రీ 2` తరహాలో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతుందని బాలీవుడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే స్త్రీ 2, ముంజ్యా సినిమాల్లో కామెడీ, హారర్ ప్రధానంగా ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలతో పాటు రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడంతో ప్రధాన పాత్ర పోషించాయి. అయితే `థామ` మాత్రం అలా కాదు అతీంద్రియ శక్తులని ప్రధానంగా చూపిస్తూ ఓ రొమాంటిక్ కామెటీ లవ్ డ్రామాగా తెరకెక్కుతోంది. హారర్ అంశాలు అంతగా లేని `థామ`...స్త్రీ 2, ముంజ్యాల స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టమనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. తాజా కామెంట్‌ల నేపథ్యంలో కుబేర, `థామ`లతో ఈ ఏడాది రష్మక మళ్లీ మ్యాజిక్ చేస్తుందా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
