అలాంటి సినిమాలకు రష్మిక లక్కీ ఛార్మ్
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా హిట్ అవడంతో రష్మిక మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది.
By: Tupaki Desk | 23 Jun 2025 4:00 PM ISTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమా హిట్ అవడంతో రష్మిక మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది. గత శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రష్మిక నుంచి వచ్చిన ఆఖరిగా వచ్చిన సినిమా సికందర్. సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవగా, ఇప్పుడు మళ్లీ కుబేర సినిమాతో రష్మిక మంచి హిట్ ను అందుకుంది.
యానిమల్, పుష్ప2, ఛావా సినిమాల సక్సెస్ తర్వాత కుబేర సినిమాకు రష్మిక అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుని, తన విజయాల పరంపరను కొనసాగిస్తోంది. కుబేర సినిమాలో ధనుష్, నాగార్జున పాత్రలకు వచ్చినంత రెస్పాన్స్ రష్మిక పాత్రకు రాకపోయినా, సమీరాగా రష్మిక ఎంతో ఒద్దికగా, చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి మన్ననలను పొందుతుంది. కుబేర సినిమాలో డంప్ యార్డ్ సీన్ లో మాత్రం రష్మిక నటన అందరినీ ఆకట్టుకుంది.
కుబేర సినిమా సక్సెస్ తర్వాత రష్మికను పాన్ ఇండియన్ సినిమాలకు లక్కీ చార్మ్ గా తన ఇమేజ్ ను నిలబెట్టుకుందని నెటిజన్లు చెప్తున్నారు. రష్మిక మందన్నా గత రెండు కోలీవుడ్ సినిమాలు సుల్తాన్, వరిసు ఓ మోస్తరు వసూళ్లనే రాబట్టుకున్నాయి. కుబేర కూడా తమిళంలో యావరేజ్ బిజినెస్ ను మాత్రమే చేస్తోంది. అయితే ఈ సినిమా సక్సెస్ రష్మికకు కోలీవుడ్ లో కొత్త మార్కెట్ ను తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం రష్మిక మందన్నా నాలుగు ప్రాజెక్టుల్లో హీరోయిన్ గా నటిస్తుండగా అందులో ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో అనే తెలుగు సినిమాలతో పాటూ థామా, కాక్‌టెయిల్2 అనే రెండు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా సినిమాకీ తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంటూ పోతున్న రష్మిక ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.
