Begin typing your search above and press return to search.

మ‌రోసారి నోరు జారిన ర‌ష్మిక‌.. క‌న్న‌డిగులు ఫైర్

కిర్రిక్ పార్టీ సినిమాతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్నా ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు.

By:  Tupaki Desk   |   5 July 2025 3:11 PM IST
మ‌రోసారి నోరు జారిన ర‌ష్మిక‌.. క‌న్న‌డిగులు ఫైర్
X

కిర్రిక్ పార్టీ సినిమాతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్నా ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక టాలీవుడ్ లో ఎంత క్రేజీ స్టార్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం ర‌ష్మిక భాష‌తో సంబంధం లేకుండా వ‌రుస పెట్టి సినిమాల‌ను చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు.

పుష్ప‌, యానిమ‌ల్, ఛావా సినిమాల‌తో పాన్ ఇండియా స్థాయిలో స‌క్సెస్‌లు అందుకున్న ర‌ష్మిక రీసెంట్ గా ధ‌నుష్ తో క‌లిసి చేసిన కుబేర సినిమా సూప‌ర్ హిట్ టాక్ తో స‌క్సెస్‌ఫుల్ గా ర‌న్ అవుతుంది. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక గ‌త కొన్నాళ్లుగా సొంత భాష అయిన క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే.

త‌న కామెంట్స్ తో క‌న్న‌డిగుల ఆగ్ర‌హానికి గుర‌వుతున్న ర‌ష్మిక ఇప్పుడు మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా ర‌ష్మిక ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ కొడ‌వ క‌మ్యూనిటీ నుంచి ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఏకైక వ్య‌క్తిని తానే అని చెప్పుకొచ్చారు. దీంతో ర‌ష్మిక వ్యాఖ్య‌ల‌పై క‌న్న‌డిగులు ఫైర్ అవుతున్నారు. వారి కోపానికి అర్థం లేక‌పోలేదు. ఎందుకంటే కొడ‌వ కమ్యూనిటీ నుంచి ఇప్ప‌టికే ఎంతోమంది ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ర‌ష్మిక ఆ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ, త‌మ కొడ‌వ క‌మ్యూనిటీ నుంచి ఎవ‌రూ ఇండ‌స్ట్రీలోకి రాలేద‌ని, తాను ఆడిష‌న్స్ చేస్తున్న విష‌యం కూడా త‌న ఫ్యామిలీకి చెప్ప‌లేద‌ని, సినిమాల్లోకి వెళ్తాన‌ని తాను ఇంట్లో ముందే చెప్ప‌లేద‌ని ర‌ష్మిక తెలిపారు. కాగా ర‌ష్మిక చేసిన కామెంట్స్ పై ఇప్పుడు తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎంతో ఫేమ‌స్ అయిన ప్రేమ కూడా కొడ‌వ క‌మ్యూనిటీకి చెందిన వ్య‌క్తే. ప్రేమ, ర‌ష్మిక కంటే చాలా ముందే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేమ కాకుండా నిధి సుబ్బ‌య్య‌, కృషి థ‌పండ‌, హ‌ర్షిక పూన‌చ్చ‌, డైసీ బోప‌న్న, శ్వేత చంగ‌ప్ప లాంటి ఎంతో మంది కూడా కొడ‌వ క‌మ్యూనిటీ నుంచి వ‌చ్చిన వారే.