Begin typing your search above and press return to search.

విజయ్‌-రష్మిక... మెల్ల మెల్లగా రివీల్‌ చేస్తున్నారా?

తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న 'మైసా' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రష్మిక ఆ పోస్టర్‌లో తన లుక్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది.

By:  Tupaki Desk   |   28 Jun 2025 10:57 AM IST
విజయ్‌-రష్మిక... మెల్ల మెల్లగా రివీల్‌ చేస్తున్నారా?
X

రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండ, నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారు అనే విషయం తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, తమిళనాట కూడా తెలిసిన విషయం. కానీ వారి నుంచి మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రావడం లేదు. ఇద్దరి నుంచి అసలు అందుకు సంబంధించిన విషయం గురించి స్పందన లేదు. కానీ కలిసి ట్రిప్స్‌కు వెళ్లడం, ఎయిర్‌ పోర్ట్‌లో ఒకరి వెనుక ఒకరు.. ఒకే కారులో ఇలా ప్రయాణించడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ ఉంది అని చెప్పకనే చెబుతున్నారు. తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని వారు రహస్యంగా ఉంచాలని అనుకోవడం లేదని, సమయం వచ్చినప్పుడల్లా కొంత కొంత రివీల్‌ చేస్తూ వస్తున్నారు అనిపిస్తుంది. అందులో భాగంగానే కలిసి ప్రయాణం చేయడం, ఒకే లొకేషన్‌లో ఉన్న ఫోటోలను షేర్‌ చేసి హింట్‌ ఇవ్వడం చేస్తున్నారు.


తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న 'మైసా' సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. రష్మిక ఆ పోస్టర్‌లో తన లుక్‌తో సర్‌ప్రైజ్‌ చేసింది. మరో లెవల్‌ అనిపించేంతగా ఆ పోస్టర్‌లో రష్మిక మందన్న ఉంది అనడంలో సందేహం లేదు. చాలా మంది రష్మిక మందన్న పోస్టర్‌కి స్పందించారు. సోషల్‌ మీడియాలో రష్మిక మందన్నకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడంతో పాటు, పోస్ట్‌లో ఆమెను చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాం అంటూ కామెంట్‌ చేసిన వారు చాలా మంది ఉన్నారు. మైసా పోస్టర్‌కి విజయ్ దేవరకొండ కూడా స్పందించాడు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్టర్‌ను షేర్‌ చేసి ఇది అద్భుతంగా ఉండబోతుంది అన్నట్లుగా కామెంట్‌ పెట్టాడు. అందుకు రష్మిక స్పందించింది.

తనకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన రష్మిక మందన్న ఒక్క పోస్ట్‌కు మాత్రం విభిన్నంగా స్పందించింది. విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్‌కు స్పందిస్తూ... 'విజ్జూ... ఈ సినిమాతో నువ్వు గర్వపడేలా నేను చేయబోతున్నాను' అంటూ పోస్ట్‌ చేసింది. ఈ కామెంట్‌తో రష్మిక, విజయ్‌ దేవరకొండల మధ్య ఉన్న లవ్‌ మరింతగా రివీల్‌ అయినట్లు అయింది. ఇండస్ట్రీలో ఎంత స్నేహితులు అయినప్పటికీ ఇలా స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ వంటి హీరోను విజ్జూ అని పిలవడం జరగదు. ఇద్దరి మధ్య స్నేహానికి మించి ఉండటం వల్లే విజయ్ దేవరకొండను విజ్జూ అని రష్మిక పిలవగలిగింది అంటూ చాలా మంది చాలా రకాలుగా విశ్లేషిస్తున్నారు.

వీరిద్దరు తమ ప్రేమ విషయాన్ని ఇలా మెల్ల మెల్లగా రివీల్‌ చేస్తున్నట్లు అనిపిస్తుందని, రాబోయే రోజుల్లో మొత్తం ఓపెన్‌గానే వీరిద్దరు అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రేమలో విహరిస్తున్న వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటారేమో చూడాలి. విజయ్ దేవరకొండ కు తమ్ముడు ఉన్నాడు. అతడు కూడా పెళ్లికి రెడీగా ఉన్నాడు. కనుక ఈ లోపు విజయ్ దేవరకొండ తన పెళ్లి విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం వచ్చే ఏడాదిలో వీరి వివాహం ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయంపై క్లారిటీ రాలేదు. ముందు ముందు వీరిద్దరు అధికారికంగా ప్రేమ, పెళ్లి విషయాలపై తేల్చుతారా అనేది చూడాలి. ప్రస్తుతం కెరీర్‌ పరంగా ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు. అంతే కాకుండా స్టార్‌డంలో పై స్థాయిలో ఉన్నారు. అందుకే పెళ్లికి కాస్త సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు.