Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : అందాల రాశి అనడంలో సందేహమా?

అయితే రాశి ఖన్నా షేర్‌ చేసిన తాజా ఫోటోలు మాత్రం మరింత అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకునే అందం తో రాశి ఖన్నా మెప్పించింది.

By:  Tupaki Desk   |   8 Jun 2025 1:00 PM IST
పిక్‌టాక్ : అందాల రాశి అనడంలో సందేహమా?
X

టాలీవుడ్‌లో దశాబ్ద కాలం క్రితం 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో కాస్త చబ్బీగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు మాత్రం సన్నగా నాజూకుగా కనిపిస్తుంది. సోషల్‌ మీడియాలో ఈమె ఫోటోలు రెగ్యులర్‌గా షేర్‌ చేస్తోంది. సన్నగా నాజూకుగా ఉన్న రాశి ఖన్నా ఫోటోలు ఈ మధ్య కాలంలో వైరల్‌ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో కంటే కోలీవుడ్‌, బాలీవుడ్‌లో ఎక్కువ బిజీగా ఉంటుంది. దాదాపు మూడు ఏళ్ల తర్వాత హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్న రాశి ఖన్నా తెలుగులో రీ ఎంట్రీకి సిద్ధం అయింది. రాశి ఖన్నా హీరోయిన్‌గా తెలుసు కదా అనే సినిమాతో రాబోతుంది.

నాగ చైతన్య హీరోగా వచ్చిన థాంక్యూ సినిమాలో రాశి ఖన్నా చివరగా తెలుగు తెరపై కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకు సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన సినిమాలో ఈమె హీరోయిన్‌గా కనిపించబోతుంది. హీరోయిన్‌గా రాశి ఖన్నాతో పాటు 'తెలుసు కదా' సినిమాలో కేజీఎఫ్‌ బ్యూటీ శ్రీనిధి శెట్టి సైతం హీరోయిన్‌గా నటించింది. సిద్దు సినిమాలంటే యూత్‌లో మంచి బజ్‌ ఉంటుంది. అలాంటి హీరోకు జోడీగా నటించడం ద్వారా రాశి ఖన్నా మరోసారి టాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో రాశి ఖన్నా తాజాగా షేర్ చేసిన ఫోటోల గురించి ఆమె ఫాలోవర్స్‌తో పాటు మీడియా వర్గాల వారు, అభిమానులు తెగ ముచ్చటించుకుంటున్నారు.

బ్లాక్‌ డ్రెస్‌లో స్కిన్‌ షో చేసిన రాశి ఖన్నా అందాల ఆరబోతకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటింది. అయినా కూడా ఈమె అందం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఈమె రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. థైస్ అందాలతో మతి పోగొడుతున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఫోటోలను అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాశి ఖన్నా ఇలా అందంగా కనిపిస్తున్న ఫోటోలు రెగ్యులర్‌గా వస్తూనే ఉన్నాయి. అయితే రాశి ఖన్నా షేర్‌ చేసిన తాజా ఫోటోలు మాత్రం మరింత అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆకట్టుకునే అందం తో రాశి ఖన్నా మెప్పించింది.

రాశి ఖన్నా బాలీవుడ్‌లో బిజీగా ఉంటుంది. ది సబర్మతి రిపోర్ట్‌ సినిమాలో రాశి ఖన్నా నటించింది. బాలీవుడ్‌లో రాశి ఖన్నాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకోలేదు. యోధ సినిమాతో సైతం హీరోయిన్‌గా బాలీవుడ్‌లో రాశి ఖన్నా నటించింది. ఆ సినిమా కూడా రాశి ఖన్నాకు అంతగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. హిందీతో పాటు తమిళ్‌లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు తమిళ్‌లో ఒక సినిమాను చేస్తుంది. ఈ ఏడాదిలో రెండు సినిమాలతో రాశి ఖన్నా వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో ఈ అమ్మడు తెలుగులో కనీసం రెండు మూడు సినిమాలు అయినా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.