బాలీవుడ్ రాశీఖన్నా తాట తీస్తుందా?
ప్రస్తుతం రాశీ లుక్ లో చాలా మార్పులొచ్చాయి. టాలీవుడ్ లో ఉన్నంత కాలం బొద్దుగానే కనిపించింది.
By: Tupaki Desk | 21 May 2025 2:00 PM ISTఅందాల రాశీఖన్నా టాలీవుడ్ లో సినిమాలు చేసినంత కాలం పెద్దగా కష్టపడింది లేదు. వచ్చిన పాత్రలు కూడా శక్తివంతమైనవి కాదు. హీరో సరసన రొమాంటిక్ సన్నివేశాలకు...పాటలకు తప్ప! రాశీఖన్నా నటిగా ఆరితేరింది లేదు. కాలక్రమంలో తెలుగులో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో రెండేళ్లగా కోలీవుడ్, బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. గత ఏడాది రిలీజ్ అయిన 'ది సబర్మతి రిపోర్టు'లో రిపోర్టర్ పాత్ర పోషించింది. రాశీ కెరీర్ మొత్తంలో గొప్ప రోల్ ఇది.
చాలెంజ్ తో కూడిన పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలందుకుంది. 'యోధ', 'సర్దార్' లాంటి చిత్రాల్లోనూ బలమైన పాత్రలు పోషించింది. ఈ పాత్రల కోసం అమ్మడు ప్రత్యకంగా సన్నధమైంది. చిత్రీకరణకు ముందు అవసరమైన వర్క్ షాపుల్లో పాల్గొంది. లుక్ పరంగా కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం రాశీ లుక్ లో చాలా మార్పులొచ్చాయి. టాలీవుడ్ లో ఉన్నంత కాలం బొద్దుగానే కనిపించింది.
కానీ హిందీ పరిశ్రమ మాత్రం అమ్మడి తాట తీసిందనే చెప్పాలి. ఛాలెంజ్ విసిరే పాత్రలు రావడంతో అందుకు తగ్గట్టు నటించాల్సి వస్తోంది. దెబ్బలు తగిలినా లెక్క చేయకుండా పనిచేయడం అలవాటు చేసుకుందని నిన్నటి పోస్ట్ తో క్లారిటీ వస్తుంది. జిమ్ లో గడపాల్సిన సమయం పెంచింది. ఆన్ సెట్స్ లో రఫ్ గా నటించాల్సి వస్తే ధైర్యంగా ముందుకెళ్తుంది. బాలీవుడ్ ఇంత డేరింగ్ తో పనిచేయకపోతే పక్కన బెట్టేస్తారు.
కొత్త అవకాశాలివ్వడానికి అక్కడ నిర్మాతలు ఆలోచిస్తారు. ఇవన్నీ గుర్తించే రాశీఖన్నా కూడా ఇన్నిరకాల మార్పులు తీసుకొచ్చింది. రాశీఖన్నా 'వార్' లాంటి భారీ యాక్షన్ చిత్రాలు చేయాలన్నది అమ్మడి డ్రీమ్. అలాంటి సినిమాలు చేయాలంటే? మరింత కఠినంగా పని చేయాల్సి ఉంటుంది. అందుకు అమ్మడు కూడా ప్రీపేర్డ్ గానే ఉన్నట్లు కనిపిస్తుంది.
