Begin typing your search above and press return to search.

వీడియో: రాశీతో సిధ్ కెమిస్ట్రీ.. కియ‌రాకు ఓకేనా?

ఇక్క‌డ రాశీఖ‌న్నా- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా న‌డుమ రొమాన్స్ అదే తీరుగా రంజుగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   25 Feb 2024 5:54 AM GMT
వీడియో: రాశీతో సిధ్ కెమిస్ట్రీ.. కియ‌రాకు ఓకేనా?
X

స్వ‌చ్ఛ‌మైన ప్రేమికులు ఒక‌రిని విడికి ఒక‌రు ఉండ‌లేరు. క్ష‌ణ‌మైనా తాళ‌లేని విర‌హం వారి మ‌ధ్య స‌హ‌జం. అలాంటి వారికి ఏకాంత స‌మ‌యం దొరికితే ఆ త‌ర్వాత ర‌స‌ర‌మ్య‌మైన రొమాన్స్ కి హ‌ద్దు ఏం ఉంటుంది చెప్పండి. ఇక్క‌డ రాశీఖ‌న్నా- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా న‌డుమ రొమాన్స్ అదే తీరుగా రంజుగా సాగుతోంది.

సిద్ధార్థ్ మల్హోత్రా- రాశి ఖన్నా జంట‌గా నటించిన యోధా సాంగ్ జిందగీ తేరే నామ్ అంతర్జాలంలో విడుద‌లైంది. ఇది ఒక అందమైన రొమాంటిక్ ట్రాక్. యువ‌త‌రంలోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది. యోధా చిత్రంలో దిశా పటానీ కూడా నటించింది. విడుదలకు ముందు మేకర్స్ ఆల్బమ్ నుండి మొదటి రొమాంటిక్ పాటను రిలీజ్ చేసారు. ఇది సిద్ధార్థ్ -రాశీల రొమాంటిక్ మూమెంట్‌తో కూడిన అందమైన గీతం. వీడియోలో అంద‌మైన‌ జంట రిలేషన్‌షిప్‌లో చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, సిద్ధార్థ్ ఇలా రాశాడు. ``#యోధ నుండి #జిందగీతేరేనామ్ విడుద‌లైంది. మార్చి 15న థియేట‌ర్ల‌లో సినిమా విడుద‌ల‌వుతుంది`` అని రాసారు. అభిమానుల్లో ఉత్కంఠను పెంచేలా టీజర్‌ను ఇటీవ‌లే మేకర్స్ షేర్ చేశారు. ఇది అందరికీ నచ్చేసింది.

యోధా క‌థాంశం ఆస‌క్తిక‌రం. ఇందులో సిధ్- రాశీ మ‌ధ్య రొమాన్స్ థియేట‌ర్ల‌లో ఆడియెన్ కి బిగ్ రిలీఫ్ గా ఉండ‌బోతోంద‌ని ఈ పాట చెబుతోంది. అయితే సిద్ధార్థ్ తో రాశీ ఘాడ‌మైన ప్రేమ స‌న్నివేశాలు కియ‌రాను టీజ్ చేస్తాయా .. ఏమో! వాటిని చూశాక కియ‌రా ఏమంటుందో?

విమానం హైజాక్ నేప‌థ్యంలో సినిమా ఇది. విమానాన్ని కొంద‌రు దుండ‌గులు హైజాక్ చేసిన సమాచారం ఎయిర్ పోర్ట్ కార్యాలయాలకు చేరుకుంటుంది. రాశి ఖన్నా ఆ సన్నివేశంలో టెన్ష‌న్ తో కనిపించింది. తదుపరి సన్నివేశంలో కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్న సిద్ధార్థ్‌ని పరిచయం చేసి, ప్రయాణికులను రక్షించడానికి బయలుదేరుతాడు. బేసిగ్గా టీజ‌ర్ లో చూపించిన విష‌యం ఇది. టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. యోధ మార్చి 15న విడుదల కానుంది.