Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : చీర కట్టులో బంగారు రాశి

అలాంటిది అందాల ఆరబోత ఫోటోలు, చీర కట్టు ఫోటోలు షేర్‌ చేస్తే అభిమానులు ఊరికే ఉంటారా... ఖచ్చితంగా ఆ ఫోటోలను తెగ షేర్‌ చేయడంతో పాటు, లైక్‌ చేయడం, కామెంట్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం.

By:  Ramesh Palla   |   26 Sept 2025 3:30 PM IST
పిక్‌టాక్‌ : చీర కట్టులో బంగారు రాశి
X

తెలుగు ప్రేక్షకులకు 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసిన ఈమె ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం. అందాల రాశి అంటూ అభిమానులతో పిలిపించుకుంటున్న రాశి ఖన్నా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తెలుసు కదా, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు విడుదల తర్వాత రాశి ఖన్నా టాలీవుడ్‌లో మరింత బిజీ కావడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులతో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మద్రాస్‌ కేఫ్‌ సినిమాతో ఎంట్రీ

హిందీ సినిమా మద్రాస్ కేఫ్‌లో సహాయ పాత్రను చేసిన రాశి ఖన్నా తెలుగులో మనం సినిమాలోనూ చిన్న పాత్రలో మెరిసింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న కారణంగా వరుసగా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ఈమె మొదటి సినిమాతోనే కమర్షియల్‌గా హిట్‌ను సొంతం చేసుకుంది. దాంతో ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. కెరీర్‌ ఆరంభంలో కాస్త ఎక్కువ బరువు ఉన్న ఈమె ఆ తర్వాత బరువు తగ్గుతూ వచ్చింది. ఆకట్టుకునే అందంతో పాటు, ఫిజిక్ పరంగా స్లిమ్‌గా ఉండటం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. రాశి ఖన్నా ఒకానొక సమయంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా యంగ్‌ హీరోలతో బ్యాక్ టు బ్యాక్‌ నటించి మెప్పించింది. సౌత్‌ తో పాటు బాలీవుడ్‌లోనూ అప్పుడప్పుడు సినిమాలు చేయడం ద్వారా అక్కడ కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న రాశి ఖన్నా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయడం ఖాయం.

ఇన్‌స్టాగ్రామ్‌లో రాశి ఖన్నా జోరు..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 11.7 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడు ఏ ఫోటో షేర్‌ చేసినా క్షణాల్లో వైరల్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఫోటోను లక్షల మంది లైక్‌ చేస్తూ ఉంటారు. సాధారణంగానే రాశి ఖన్నా ఫోటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. అలాంటిది అందాల ఆరబోత ఫోటోలు, చీర కట్టు ఫోటోలు షేర్‌ చేస్తే అభిమానులు ఊరికే ఉంటారా... ఖచ్చితంగా ఆ ఫోటోలను తెగ షేర్‌ చేయడంతో పాటు, లైక్‌ చేయడం, కామెంట్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. రాశి ఖన్నా అందాల ఆరబోత ఫోటోలు వరుసగా సోషల్‌ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి. ఈసారి చీర కట్టు ఫోటోల కారణంగా రాశి ఖన్నా వార్తల్లో నిలిచింది. బంగారు వర్ణంలో ఉన్న రాశి ఖన్నా ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. చీర కట్టిన రాశి ఖన్నా పెద్దగా షో చేయకున్నా కూడా వైరల్‌ అవుతోంది.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీ బిజీ

ఢిల్లీకి చెందిన రాశి ఖన్నా 1990లో జన్మించింది. ఢిల్లీలోని సెయింట్‌ మార్క్స్‌ సీనియర్‌ సెకండరీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన రాశి ఖన్నా తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజీలో ఆంగ్లంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్ లో ఆనర్స్‌లో పట్టా సాధించింది. ఢిల్లీ నుంచి ముంబైకి మోడలింగ్‌ కోసం వెళ్లిన రాశి ఖన్నా మెల్ల మెల్లగా సినిమా ఇండస్ట్రీలో రాణించడం మొదలు పెట్టింది.

ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఈమె బాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేయాలని ఆశ పడుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్‌ ఉన్న హీరోయిన్‌ కావడం వల్ల తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌, ఇతర సౌత్‌ ఇండియన్‌ భాషల్లోనూ ఈమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి అందాల చీర కట్టు ఫోటోల కారణంగా రాశి ఖన్నా మరింత బిజీగా సినిమాలు చేస్తుందేమో చూడాలి.