Begin typing your search above and press return to search.

అందంలో మామ్ ర‌వీనాటాండ‌న్‌ని మించి..!

ఇక ఇప్ప‌టికే రాషా త‌డానీ హాటెస్ట్ స్టిల్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. మామ్ ర‌వీనా టాండ‌న్ తో క‌లిసి రాషా లుక్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2023 1:30 PM GMT
అందంలో మామ్ ర‌వీనాటాండ‌న్‌ని మించి..!
X

హాట్ హీరోయిన్ రవీనా టాండన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'బంగారు బుల్లోడు'లో ఒక క‌థానాయిక‌గా న‌టించింది. ద‌శాబ్ధాల పాటు బాలీవుడ్ ని ఏలిన ర‌వీనా ఇండ‌స్ట్రీ హాటెస్ట్ హీరోయిన్ గా పాపుల‌రైంది. నిరంత‌రం స్టార్ హీరోల‌తో ప్రేమాయ‌ణాలతోను ఈ భామ మీడియా హెడ్ లైన్స్ కెక్కింది. ర‌వీనా ఇటీవ‌లే కేజీఎఫ్ 2లో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించ‌డం ఆస‌క్తిని క‌లిగింది. కేజీఎఫ్ ఫ్రాంఛైజీ త‌దుప‌రి చిత్రాల్లోను ర‌వీనా క‌నిపించే వీలుంది.


ఇప్పుడు ర‌వీనా టాండ‌న్ కుమార్తె రాషా థడానీ బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఇంకా డెబ్యూ ఇవ్వ‌క ముందే 18 ఏళ్ల అమ్మాయి రెండు సినిమాల్లో న‌టించేస్తోంద‌ని స‌మాచారం. బాలీవుడ్‌లో ఆమన్ దేవగన్‌తో కలిసి ఇంకా పేరు పెట్టని చిత్రంతో ఆరంగేట్రం చేస్తోంది. ఇందులో అజయ్ దేవగన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీనిని అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌ముందే ఇప్పటికే తన రెండవ సినిమా అవ‌కాశాన్ని కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు రాషా టాలీవుడ్ లో ఆరంగేట్రానికి రెడీ అవుతోంది స‌మాచారం. అది కూడా ప‌రిశ్ర‌మ అగ్ర‌హీరో స‌ర‌స‌న తెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం RC 16 తో ర‌వీనా కుమార్తె రాషా తెలుగులో అడుగుపెడుతుంద‌ని తెలిసింది. RRR స్టార్ చ‌ర‌ణ్ తో ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సనా స్పోర్ట్స్ డ్రామాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ చిత్రంలో రాషా ఒక ముఖ్యమైన పాత్రలో నటించవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే రాషా కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయ‌లేదు. అయితే ఈ రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మేకర్స్ తమ తారాగణం వివ‌రాల్లో రాషా గురించి ప్రకటించే వీలుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ అమ్మాయి ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ యంగ్ గాళ్ ఎంతో గొప్ప‌ ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది. రాషా కాలేజీ ఈవెంట్‌లో పాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


అందంలో ర‌వీనాకు త‌గ్గ‌దుగా..

ఇక ఇప్ప‌టికే రాషా త‌డానీ హాటెస్ట్ స్టిల్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. మామ్ ర‌వీనా టాండ‌న్ తో క‌లిసి రాషా లుక్ కి సంబంధించిన ఫోటోలు కూడా వైర‌ల్ అయ్యాయి. వీటిలో త‌ల్లిని మించిన అందంతో రాషా గుబులు రేపుతోంది. 90ల‌లో హాట్ కంటెంట్ తో అల‌రించిన మేటి క‌థానాయిక ర‌వీనాకు సిస‌లైన న‌ట‌వార‌సురాలు అవుతుందంటూ సోష‌ల్ మీడియాల్లో అభిమానులు న‌మ్మ‌కం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రాషా ఇన్ స్టా ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో గుబులు రేపుతున్నాయి. రాషా క్యూబాల్ ఆడుతూ, స్నేహితుల‌తో క‌లిసి గ‌ణ‌ప‌తి బ‌ప్పా పూజ‌లాచ‌రిస్తూ.. మామ్ రవీనాతో క‌లిసి చిల్ చేస్తూ.. అలాగే త‌న పెంపుడు ప‌ప్పీతో ఆడుకుంటూ.. ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చిన ఫోటోలు ఆక‌ట్టుకుంటున్నాయి.

రాషా థడాని అసలు పేరు రాషవిశాఖ థ‌డాని. విద్యాభ్యాసం ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పూర్తి చేసింది. యంగ్ గాళ్ పాడటమే కాకుండా తైక్వాండో కూడా నేర్చుకుంది. జాన్వీ క‌పూర్ త‌ర్వాత టాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తున్న క్రేజీ న‌ట‌వార‌సురాలిగా రాషా పేరు మార్మోగ‌నుంది.