Begin typing your search above and press return to search.

వీడియో: అందంతో క‌వ్విస్తున్న ర‌వీనా టాండ‌న్ కూతురు

కొత్త త‌రం న‌టీన‌టుల‌ను చూసాక .. ప్రేక్ష‌కులు పూర్తిగా పెద‌వి విరిచేస్తున్నారు. కానీ వీళ్లంద‌రికీ భిన్నంగా మేటి క‌థానాయిక ర‌వీనాటాండ‌న్ కుమార్తె రాషా త‌డానీ చంపుతోంది.

By:  Tupaki Desk   |   28 May 2025 3:00 AM IST
వీడియో: అందంతో క‌వ్విస్తున్న ర‌వీనా టాండ‌న్ కూతురు
X

న‌ట‌వార‌సులు చాలా మంది సినీప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. కానీ వీళ్ల‌లో ఎవరూ అంత‌గా ప్ర‌భావం చూప‌డం లేదు. అందంతో లేదా న‌ట‌న‌తో మెప్పించ‌లేక త‌డ‌బ‌డుతున్నారు. ఇటీవ‌లి కాలంలో జాన్వీక‌పూర్, సారా అలీఖాన్, అన‌న్య పాండే మాత్ర‌మే న‌ట‌వార‌సుల‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ త‌ర్వాతి జ‌న‌రేష‌న్ లో చాలా మంది పెద్ద తెర‌కు ప‌రిచ‌య‌మైనా కానీ, ప్ర‌యోజ‌నం లేదు. వారి న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న అంత‌గా ఆక‌ట్టుకోవ‌డం లేదు. క‌నీసం అంద‌చందాలు, గ్లామ‌ర్ ఎలివేష‌న్ ప‌రంగానూ ఎవ‌రూ మెప్పించ‌లేక‌పోయారు.

కొత్త త‌రం న‌టీన‌టుల‌ను చూసాక .. ప్రేక్ష‌కులు పూర్తిగా పెద‌వి విరిచేస్తున్నారు. కానీ వీళ్లంద‌రికీ భిన్నంగా మేటి క‌థానాయిక ర‌వీనాటాండ‌న్ కుమార్తె రాషా త‌డానీ చంపుతోంది. రాషా అంద‌చందాలు, మేని విరుపుల‌కు కుర్ర‌కారులో గుబులు పుడుతోంది. సినీప‌రిశ్ర‌మ‌లో పేరున్న బిజినెస్ మ్యాగ్నెట్స్ త‌డానీలు. హిందీ బెల్ట్ లో పంపిణీ రంగం స‌హా సినీ నిర్మాణ రంగంలో త‌డానీలు పెద్ద స్థాయి వ్య‌క్తులు. అలాంటి గొప్ప కుటుంబం నుంచి వ‌చ్చిన రాషా ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం కాక ముందే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇప్పుడు త‌న మ‌మ్మీ లెగ‌సీని ముందుకు తీసుకెళ్ల‌డానికి చాలా శ్ర‌మిస్తోంది. ర‌వీనా త‌ర‌హాలోనే అద్భుత‌మైన డ్యాన్సులతో అద‌ర‌గొడుతోంది. రాషా ఇటీవ‌ల అజ‌య్ దేవ‌గ‌న్ మేన‌ల్లుడు అమ‌న్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న `ఆజాద్` అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో అదిరిపోయే స్పెష‌ల్ నంబ‌ర్ లో కూడా న‌ర్తించింది. రాషా న‌ట‌న‌, అంద‌చందాల‌కు మంచి మార్కులే వేశారు. ఇక ఇదే హుషారులో రాషా త‌డానీ టాలీవుడ్ లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని ఊహిస్తున్నారు.

రాషా టాలీవుడ్ కి తెలుగు చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశిస్తే ఇక్క‌డ ఒక ఊపు ఊప‌డం ఖాయం. ఈ టీనేజీ బ్యూటీ స‌హ‌జ సౌంద‌ర్యం, ఒడ్డు పొడుగు, మ‌త్తెక్కించే క‌ళ్లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. అందుకే రాషా వేగంగా టాలీవుడ్ లో దూసుకెళుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించేందుకు అవ‌కాశం ఉన్న న‌వ‌త‌రం హీరోల‌కు కూడా రాషా బెస్ట్ ఆప్ష‌న్ గా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే రాషా త‌డానీ నంద‌మూరి మోక్ష‌జ్ఞ డెబ్యూ చిత్రంలో న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగినా కానీ, ఆ త‌ర్వాత ఈ మూవీ గురించిన స‌మాచారం ఏదీ బ‌హిర్గ‌తం కాలేదు. అటు హిందీలో ప‌లు చిత్రాల‌కు రాషా త‌డానీ సంత‌కాలు చేసింద‌ని తెలుస్తోంది.