Begin typing your search above and press return to search.

పాక్ న‌టితో ప్రేమ‌లో భార‌తీయ గాయ‌కుడు?

ఆమె పాకిస్తానీ న‌టి. అత‌డు భార‌త‌దేశంలో పాపుల‌ర్ గాయ‌కుడు. ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య జ‌త కుదిరింది

By:  Tupaki Desk   |   3 Dec 2023 2:30 AM GMT
పాక్ న‌టితో ప్రేమ‌లో భార‌తీయ గాయ‌కుడు?
X

ఆమె పాకిస్తానీ న‌టి. అత‌డు భార‌త‌దేశంలో పాపుల‌ర్ గాయ‌కుడు. ఆ ఇద్ద‌రికీ మ‌ధ్య జ‌త కుదిరింది. ఎంత‌గా అంటే క‌లిసి చాటింగ్ చేసేంత‌గా.. రెస్టారెంట్ లో బీర్ షేర్ చేసుకునేంత వ‌ర‌కూ. అయితే దీనిని కొంద‌రు స్నేహం మాత్ర‌మేన‌ని అంటే, మ‌రికొంద‌రు ల‌వ్‌- డేటింగ్ అని ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత‌కీ స‌ద‌రు పాక్ న‌టీమణితో భార‌తీయ గాయ‌కుడు డేటింగ్ లో ఉన్నాడా? అంటే .. దీని జ‌వాబు కోసం వివ‌రాల్లోకి వెళ్లాలి.

భార‌తీయ గాయ‌కుడు, పాపుల‌ర్ ర్యాప‌ర్ బాద్షా గురించి తెలియ‌నిది ఎవరికి? భారతీయ రాపర్ కం గాయ‌కుడు తనకంటూ తగినంత పేరు గుర్తింపు సంపాదించుకున్నాడు. కాలా చష్మా, లెట్స్ నాచో, గెండా ఫూల్ అతడి పాపుల‌ర్ పాటల్లో కొన్ని. ర్యాప‌ర్ తన పాటల కోసం కాకున్నా, అతడి ల‌వ్ లైఫ్ రీత్యా నిరంత‌రం హెడ్ లైన్స్ లో ఉన్నాడు. బాద్ షా పాకిస్థానీ నటి హనియా అమీర్‌తో కలిసి ఉన్న ఫోటోలు ఇటీవ‌ల‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అత‌డు హెడ్ లైన్స్ లోకొచ్చాడు. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా ఒక సింపుల్ క్యాప్షన్‌తో షేర్ చేసింది హనియా. ఈ ఫోటోలు వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలకు దారితీశాయి.

ఆమెతో బాద్షా డేటింగ్ చేస్తున్నారా?

హనియా అమీర్ ఈ పోస్ట్ కి ''పిల్లలు షాపింగ్ చేసారు'' అని క్యాప్షన్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి దుబాయ్‌లో షాపింగ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు మ‌న‌స్ఫూర్తిగా నవ్వుతూ ఉన్న ఫోటోల‌ను కూడా స‌ద‌రు పాక్ నటి షేర్ చేసింది. వారిద్దరూ కలిసి కాఫీని ఆస్వాధించిన వీడియో కూడా ఉంది. వారి ముఖాల్లో విశాలమైన చిరునవ్వు చూస్తుంటే కలిసి సమయాన్ని ఆస్వాధించారని చెప్పవచ్చు. ఊహాగానాలు విపరీతంగా నడుస్తున్న ఈ స‌మ‌యంలో చాలా మంది నెటిజ‌నులు హనియా - బాద్షా జంట‌కు మ‌ద్ధ‌తుగా నిలిచారు.

ఇద్దరు వ్యక్తులు ఎందుకు స్నేహితులుగా ఉండకూడదు? అని కొంద‌రు నెటిజ‌నులు ప్రశ్నించారు. కామెంట్‌లలో ఒకదానిలో ''ఇద్దరు స్నేహితులు తిరుగుతుంటే.. వారు డేటింగ్ చేస్తున్నారని ఎందుకు భావించాలి?!''.. ''ఈ రోజుల్లో ఒక అమ్మాయి సెల్ఫీ కూడా తీసుకోకూడ‌దు! ఇంత‌లోనే పుకార్లు వ్యాపించాయి!! అని మరొక‌రు వ్యాఖ్యానించారు.

జనవరిలో హనియా అమీర్ - బాద్షా జంట‌పై పుకార్లు ప్రారంభమయ్యాయి. రాపర్ బాద్షా ఆమె పోస్ట్‌లలో ఒకదానిపై కామెంట్ చేసారు. ఆ త‌ర్వాతా అభిమానులు తరచుగా సోషల్ మీడియా ఇద్దరి మధ్య సంభాషణ‌ల‌ను గుర్తించారు. హనియా అమీర్ లైవ్ సెషన్స్‌పై బాద్షా సరదా వ్యాఖ్యలు చేసాడు. అతడి కోసం స్వీట్ బర్త్ డే పోస్ట్ చేసింది పాక్ న‌టి హ‌నియా. దీంతో ఇద్దరి మధ్య ఏదో జ‌రుగుతోంద‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అయితే బాద్షా - హనియా దీనిపై ఇంకా వ్యాఖ్యానించలేదు. ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు.

హనియా అమీర్ పాకిస్తాన్ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరు. మేరే హమ్‌సఫర్ టీవీ షోతో ఖ్యాతి గడించింది. ఫర్హాన్ సయీద్, అలీ ఖాన్ మరి కొంద‌రితో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకుంది. మేరే హమ్సఫర్ ఇప్పటివరకు అత్యుత్తమ పాకిస్థానీ రియాలిటీ షోలలో ఒకటి.