Begin typing your search above and press return to search.

ఆ సినిమా రిలజ్ట్ మీదే హీరో భవిష్యత్తు..?

ఇస్మార్ట్ శంకర్ హిట్ కాంబో ఈసారి డబుల్ ఇస్మార్ట్ గా అదరగొట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఫలితం మీద రామ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   17 Jan 2024 2:30 PM GMT
ఆ సినిమా రిలజ్ట్ మీదే హీరో భవిష్యత్తు..?
X

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కెరీర్ ఎప్పుడు కూడా ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్న చందంగానే కొనసాగుతుంది. యువ హీరోల్లో తనలో ఉన్న డబుల్ ఎనర్జీతో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్న రామ్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వస్తున్నాడు. అయితే కొన్ని సినిమాలు అతనికి సూటవ్వకపోవడం.. కొన్ని కథలకు అతను పర్ఫెక్ట్ అనిపించపోవడం వల్ల ఫలితాలు మారిపోతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి ఫాంలోకి వచ్చినట్టే అనిపించిన రామ్ ఆ తర్వాత వచ్చిన రెడ్ మిశ్రమ స్పందనతో ఓకే అనిపించాడు.


ఇక 2022 లో వచ్చిన ది వారియర్, లాస్ట్ ఇయర్ వచ్చిన స్కంద రెండు భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచాయి. ఈ రెండు సినిమాల మీద రామ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అయితే సినిమా తీయడం వరకే హీరోల పని రిజల్ట్ అనేది వారి చేతుల్లో ఉండదు. స్కంద తర్వాత రామ్ మరోసారి ఇస్మార్ట్ డైరెక్టర్ తో జతకడుతున్నాడు. ఈసారి డబుల్ ఇస్మార్ట్ అంటూ డబుల్ ఫోర్స్ తో వస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు రామ్.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ తో పాటుగా బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ హిట్ కాంబో ఈసారి డబుల్ ఇస్మార్ట్ గా అదరగొట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ఫలితం మీద రామ్ భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పొచ్చు. లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీతో సినిమా అంటే అందరు హీరోలు వెనక్కి తగ్గారు. కానీ రామ్ మాత్రం మరోసారి పూరీతో రిస్క్ చేసేందుకు రెడీ అయ్యాడు.

ఇస్మార్ట్ శంకర్ టైం లో కూడా పూరీ వరుస ఫ్లాపులు చేస్తుండగా.. రామ్ కూడా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అలా ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ట్రాక్ ఎక్కగా మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు రామ్, పూరీ జగన్నాథ్. ఈ సినిమా విషయంలో ప్రతిదీ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు వచ్చిన అవుట్ పుట్ కూడా చాలా సాటిస్ఫైడ్ గా ఉందని టాక్. పూరీ మార్క్ సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం కానీ అంచనాలను అందుకోవడంలో ఈమధ్య పూరీ మిస్ అవుతున్నాడు. మరి పూరీ రామ్ మరోసారి తన ఇస్మార్ట్ మ్యాడ్ నెస్ ని చూపిస్తారా లేదా అన్నది చూడాలి.