Begin typing your search above and press return to search.

రావు రమేశ్​ MNS.. ఈసారి మరింత భిన్నంగా..

ఎటువంటి వాయిదాలు లేకుండా రావు రమేశ్ తన షూటింగ్​ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది.

By:  Tupaki Desk   |   18 Dec 2023 5:38 AM GMT
రావు రమేశ్​ MNS.. ఈసారి మరింత భిన్నంగా..
X

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో కంటెంట్ బేస్డ్ సినిమాల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా.. సీనియర్ హీరోలు విలన్లుగా మారిపోతున్నారు. అయితే సూపర్​ టైమింగ్​తో విలక్షణ నటుడిగా పేరు సంపాదించిన రావు రమేశ్​ కూడా హీరోగా మారబోతున్నట్లు కొన్ని నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. మారుతి నగర్ సుబ్రమణ్యం పేరుతో రాబోతున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో ఆయన లీడ్ చేస్తున్నారు.


తాజాగా మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎటువంటి వాయిదాలు లేకుండా రావు రమేశ్ తన షూటింగ్​ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ ఎక్కువ డేట్స్ కేటాయించి రావు రమేశ్ సినిమా పూర్తి కావడానికి​ ఎంతో సపోర్ట్ చేశారని వెల్లడించింది. త్వరలోనే సినిమా రిలీజ్​ డేట్​ను ప్రకటిస్తామని తెలిపింది.

"రావు రమేశ్​ గారిని ఇప్పటి వరకు చూసిన దాని కన్నా పదిరెట్లు ఎక్కువ ఎంటెర్టైన్ క్యారెక్టర్​లో ఈ సినిమాలో కనిపిస్తారు. చిత్రీకరణ పరంగా ఆయన మాకు ఎంతో సహాయం చేశారు. ఆయన షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ ఎక్కువ డేట్స్ కేటాయించి సినిమా పూర్తి కావడానికి మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాపై, మాపై ఆయనకు ఎంతో నమ్మకం, ప్రేమ ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు మారుతి నగర్ సుబ్రమణ్యం ఫుల్ ఎంటర్​టైన్​మెంట్​ అందిస్తుంది" అని డైరెక్టర్ లక్ష్మణ్​ కార్య తెలిపారు.

ఈ మూవీకి హ్యాపీ వెడ్డింగ్ ఫేమ్ లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. రావు రమేశ్​, ఇంద్రజ ఇంతకు ముందు ఒకటి రెండు సినిమాల్లో నటించినా ఫుల్ లెంగ్త్ కాంబినేషన్, రోల్స్ చేయలేదు. వాళ్ల కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అయితే బిజీ షెడ్యూళ్ల మధ్యలో కూడా మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీకి సంబంధించి మొత్తం షూటింగ్ కంప్లీట్ చేయడంతో రావు రమేశ్​పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాపై కమిట్​మెంట్​ అంటే ఇదేనని అంటున్నారు. ఈ సినిమాలో రావు రమేశ్​ యాక్టింగ్​ అదిరిపోద్దని చెబుతున్నారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ ఆర్టిస్టుగా మారిపోయారు రావు రమేశ్. కెరీర్ మొదట్లో ఆయన చిన్నా చితకా పాత్రలతో నెట్టుకొచ్చారు. బ్లాక్ బస్టర్ చిత్రం కొత్త బంగారులోకంలో చేసిన లెక్చరర్ పాత్రతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కామెడీ విలన్‌గా రాణిస్తున్నారు. అయితే మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్రంతో కెరీర్‌లో మరో మెట్టు ఎక్కుతున్న రావు రమేశ్​ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.