Begin typing your search above and press return to search.

రావు ర‌మేష్ కి జోడీగా ఆ హీరోయిన్!

అయితే ఇదే సినిమాలో అన్షు రావు ర‌మేష్ జోడీగా న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇందులో రమేష్ ఓకీల‌క పాత్ర పోషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 May 2024 1:16 PM GMT
రావు ర‌మేష్ కి జోడీగా ఆ హీరోయిన్!
X

అన్షు అంబానీ టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. అమ్మ‌డు తొలి సినిమా 'మ‌న్మ‌ధుడు' తో మంచి స‌క్సెస్ అందు కున్న సంగ‌తి తెలిసిందే. అటుపై ప్ర‌భాస్ తో 'రాఘ‌వేంద్ర‌'.. 'మిస్మ‌మ్మ' చిత్రాల్లో గెస్ట్ అపిరియ‌న్న్ ఇచ్చింది. కోలీవుడ్ లో 'జై' అనే చిత్రంలోనూ న‌టించింది. ఇదే అన్షు చిట్ట చివ‌రి సినిమా. ఆ త‌ర్వాత మళ్లీ అన్షు జాడ టాలీవుడ్ లో లేదు. మ‌రి అవ‌కాశాలు రాక సినిమాలు చేయ‌లేదా? వ‌చ్చినా కాద‌న‌కుని లండ‌న్ వెళ్లిపోయిందా? అన్న‌దు తెలియ‌దు గానీ వివాహం త‌ర్వాత అక్క‌డే స్థిర‌ప‌డిపోయింది.

ఈ మ‌ధ్య‌నే మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయింది. కొన్ని కొత్త ఫోటోలు షేర్ చేసి అంతా స్ట‌న్ అయ్యేలా చేసింది. అచ్చం 20 ఏళ్ల క్రితం నాటి బ్యూటీతోనే ఇప్ప‌టికీ అలాగే ఉంది. నాటి బ్యూటీని ఇప్ప‌టికీ ఎక్క‌డా చెక్కు చెద‌ర‌నివ్వ‌లేదు. అదే లుక్..అదే గ్లామ‌ర్ మెయింటెన్ చేస్తూ అభిమానుల్ని అల‌రించింది. నేను సినిమాలు చేయ‌క‌పోతేనేం..తెర‌పై క‌నిపించ‌క‌పోతేనేం? నేను అభిమానుల్ని క‌వ్వించ‌డంలో మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌న‌నేసింది.

ఇప్పుడా క్రేజ్ మ‌ళ్లీ టాలీవుడ్ లో అవ‌కాశాలు తెప్పిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. అవును తాజాగా అమ్మ‌డు ఓ సినిమాకి సైన్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అయితే ఆ సైన్ చేసింది ఓ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కి కావ‌డంతో అభిమానులు కాస్త నిరుత్సాహ ప‌డుతున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే. సందీప్ కిష‌న్ 30వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సినిమాలో ఇద్దరు కథానాయికలు. వాళ్లు ఎవ‌రు? అన్న‌ది క‌న్ప‌మ్ కావాల్సి ఉంది.

అయితే ఇదే సినిమాలో అన్షు రావు ర‌మేష్ జోడీగా న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇందులో రమేష్ ఓకీల‌క పాత్ర పోషిస్తున్నారు. క‌థ‌లో ఆ పాత్ర‌కు చాలా వెయిట్ ఉందిట‌. భార్య రోల్ కి కూడా చాలా ప్రాధ‌న్య‌త ఉంటుందిట‌. ఈ నేప‌థ్యంలో అన్షుని సంప్రదించ‌డం..స్టోరీ చెప్ప‌డం..ఆమె ఒకే చెప్పడం అన్ని జరిగిపోయాయ‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో టాక్ న‌డుస్తోంది. సినిమాలో అన్షు పాత్ర హైలైట్ అని.. ఆమె పాత్రకి చాలా ప్రాధాన్య‌త ఉండ‌టంతో ర‌మేష్ స‌ర‌స‌న న‌టించ‌డానికి అంగీక‌రించింద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప్ర‌చారంలో వాస్త‌వం తేలాల్సి ఉంది.