Begin typing your search above and press return to search.

డాన్ తో కియారా రొమాన్స్ ఖాయ‌మేనా!

ఈసారి షారుక్ ఖాన్ స్థానంలో ర‌ణ‌వీర్ సింగ్ డాన్ గా మెప్పించ‌బోతున్నాడు

By:  Tupaki Desk   |   10 Aug 2023 6:41 AM GMT
డాన్ తో కియారా రొమాన్స్ ఖాయ‌మేనా!
X

బాలీవుడ్ లో 'డాన్ -3' కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసారి షారుక్ ఖాన్ స్థానంలో ర‌ణ‌వీర్ సింగ్ డాన్ గా మెప్పించ‌బోతున్నాడు. రెండు భాగాల్లోనూ షారుక్ న‌టించి మెప్పించ‌గా ఇప్పుడా బాధ్య‌త‌లు ర‌ణ‌వీర్ తీసుకున్నారు. ప‌ర్హాన్ అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతుంది. ఈ నేప‌థ్యంలో ర‌ణ‌వీర్ కి జోడీగా పాపుల‌ర్ బ్యూటీ కియారా అద్వాణి ని రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈచిత్రాన్ని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ ఎక్స్ ఎల్ సంస్థ‌లో కియారా ప్ర‌త్య‌క్ష‌మైంది.

స్పాట్ లో ప‌ర్హాన్ అక్త‌ర్ కూడా ఉండ‌టంతో 'డాన్ -3' డిస్క‌ష‌న్ లో భాగంగానే ఆ జోడీ అక్క‌డ కనిపించి న‌ట్లు బాలీవుడ్ మీడియా భావిస్తోంది. కియారా కి స్టోరీ న‌చ్చ‌డంతో ఒకే చెప్పింద‌ని నిర్మాణ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. ర‌ణ‌వీర్ తో తెర‌ను పంచుకోవ‌డానికి ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నాన‌ని.. ఆఛాన్స్ డాన్ రూపంలో ముందుకు రావ‌డం ప‌ట్ల అమ్మ‌డు సంతోషంగా ఉన్న‌ట్లు తెలిసింది. మొత్తానికి కియారికిది మంచి ఆఫ‌ర్ అనే చెప్పాలి. అయితే ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా దృవీక‌రించాల్సి ఉంది.

ఇప్ప‌టికే అమ్మ‌డి వేగానికి తిరుగు లేదు. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. రెండేళ్ల‌గా ప‌రాజ‌య‌మ‌నేది అమ్మ‌డి కెరీర్ లో క‌నిపించ‌లేదు. ఇదే స‌మ‌యంలో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న 'గేమ్ ఛేంజ‌ర్' లో న‌టించే అరుదైన అవ‌కాశం ఒడిసిప ట్టుకుంది. ఈ సినిమా స‌క్సెస్ అయితే కియారా రేంజ్ పాన్ ఇండియాని దాటిపోతుంది. విదేశాల్లోనూ ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా రిలీజ్ చేయ‌నున్నారు. ఇవ‌న్నీ కియారా కెరీర్ కి క‌లిసొచ్చే అంశాలే.

ప్ర‌స్తుతం కియారా చేతిలో అధికారికంగా ఉన్న ప్రాజెక్ట్ గేమ్ ఛేంజ‌ర్ మాత్ర‌మే. కొత్త సినిమాలేవి క‌మిట్ అవ్వ‌లేదు. సిద్దార్ద్ మ‌ల్హోత్రాతో వివాహం త‌ర్వాత కెరీర్ ప‌రంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల విష‌యంలో ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటుంది. వివాహం త‌ర్వాత ఏమాత్రం నెగివిటీ స్ప్రెడ్ అవ్వ‌కుండా అన్నిర‌కాలుగా ఆలోచించి ముందుకెళ్తుంది.