Begin typing your search above and press return to search.

'డాన్-3' దూసుకొస్తున్నాడే? ఎవ‌రో ఆ డాన్!

బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ డాన్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   8 Aug 2023 12:07 PM GMT
డాన్-3 దూసుకొస్తున్నాడే? ఎవ‌రో ఆ డాన్!
X

బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ 'డాన్' జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాద్ షా షారుక్ ఖాన్-ప‌ర్హాన్ అక్త‌ర్ ద్వ‌యం డాన్ ప్రాంచైజీని ఓ రేంజ్ లో మార్కెట్ లోకి వ‌దిలారు. 2006 లో రిలీజ్ అయిన 'డాన్ -ది చేజ్ బిగెన్స్ ఎగైన్' బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో షేక్ చేసింది. 30 కోట్ల బ‌డ్జెట్ లో తెర‌కెక్కిన సినిమా 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. అటుపై రిలీజ్ అయిన 'డాన్ -2' ది కింగ్ ఈజ్ బ్యాక్' తో మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద మోత మ్రోగింది.

2011లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. అప్ప‌ట్లో నే సినిమా 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. అప్ప‌టి నుంచి 'డాన్ 3' ఎప్పుడంటూ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతునే ఉన్నాయి. కానీ ఏనాడు ఆ ద్వ‌యం స్పందించ‌లేదు. తాజాగా 12 ఏళ్ల గ్యాప్ అనంత‌రం మ‌ళ్లీ 'డాన్3' తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప‌ర్హాన్ అక్త‌ర్ ప్ర‌క‌టించారు. డాన్ ప్రాంచైజీ నుంచి ఇదే చివ‌రి చిత్రంగా తెలుస్తోంది.

అయితే ఈసారి షారుక్ స్థానంలో కి ర‌ణ‌వీర్ సింగ్ వ‌స్తున్న‌ట్లు వినిపిస్తోంది. ర‌ణ‌వీర్ సింగ్ హీరోగా డాన్ -3ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ ప‌ర్హాన్ అక్త‌ర్ షేర్ చేసారు. దీంతో ఆయ‌నే హీరో అనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో అభిమానుల్లో 'డాన్ -3'పై ఆస‌క్తి మొద‌లైంది. అయితే హీరో ఎవ‌రు? అన్న‌ది క్లారిటీ రావ‌డం లేదు.

య‌ధావిధిగా షారుక్ న‌టిస్తాడా? ర‌ణ‌వీర్ సింగ్ కి ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించారా? అన్న అంశంపై క్లారిటీ రావ‌డం లేదు. అతి త్వ‌ర‌లో ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ డాన్ 3 లో ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తే అత‌ని కెరీర్ ప‌తాక స్థాయికి చేరుతుంది. ఇప్ప‌టికే విభిన్న ర‌కాల సినిమాలు చేసారు.

కెరీర్ లో ఎన్నో సాహ‌సోపేత‌మైన రోల్స్...వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. డాన్ త‌ర‌హా సినిమాలు మాత్రం చేయ‌లేదు. ఇటీవ‌లే 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ క‌హానీ' సినిమా తోనూ మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఈ ఉత్సాహంలో 'డాన్ 3'లో ఛాన్స్ వ‌స్తే! అది ర‌ణవీర్ కెరీర్ ని మ‌రింత ముందుకుతీసుకెళ్లే చిత్రంగా చెప్పొచ్చు.