Begin typing your search above and press return to search.

#గుస‌గుస‌.. క్వీన్ కంగ‌న‌పై అలా క‌క్ష‌ తీర్చుకున్నాడు!

అయితే వీటిని ఆ జంట అస్స‌లు మ‌ర్చిపోలేద‌న‌డానికి తాజాగా ర‌ణ‌వీర్ విసిరిన పంచ్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Aug 2023 3:51 AM GMT
#గుస‌గుస‌.. క్వీన్ కంగ‌న‌పై అలా క‌క్ష‌ తీర్చుకున్నాడు!
X

క్వీన్ కంగ‌న ర‌నౌత్ బాలీవుడ్ మాఫియా గురించి ప్ర‌తిసారీ త‌న‌దైన శైలిలో మాట‌ల‌ తూటాలు పేల్చ‌డంలో ఆరితేరిపోయింది. క‌ర‌ణ్ జోహార్- భ‌న్సాలీ-చోప్రాస్‌- భ‌ట్స్-క‌పూర్స్-రోష‌న్స్ ఎవ‌రినీ విడిచిపెట్ట‌దు ఈ బొమ్మాళీ. హిందీ చిత్ర‌సీమ‌లో ఇన్ సైడ‌ర్- ఔట్ సైడ‌ర్ గేమ్ గురించి ఇప్ప‌టికే కంగ‌న ప‌లుమార్లు త‌న‌దైన వాద‌న వినిపించింది. బ‌య‌టి వారిని ఎద‌గ‌నీకుండా బాలీవుడ్ మాఫియా కుట్ర‌లు ప‌న్నుతుంద‌ని ఇంత‌కుముందు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానంత‌రం వ్యాఖ్యానించింది.

చాలా సంద‌ర్భాల‌లో క‌ర‌ణ్ జోహార్ పై నిప్పులు చెరిగిన కంగ‌న.. అత‌డు తెర‌కు ప‌రిచ‌యం చేసి, మెంటార్ గా ఉన్న న‌టీన‌టుల‌పైనా కంగ‌న య‌థావిధిగా విరుచుకుప‌డుతుంది. అదే కోవ‌లో స్టార్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ పైనా తీవ్రంగా విరుచుకుప‌డింది. వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా ర‌ణ‌వీర్ - దీపిక ఇద్ద‌రిపైనా ఫిరంగులు విస‌ర‌డం... క‌త్తులు దూయ‌డం తెలిసిన వ్య‌వ‌హార‌మే. ఇంత‌కుముందు దీపిక‌-ర‌ణ‌వీర్ జంట మ‌ధ్య నిజ‌మైన ప్రేమ‌లేద‌ని అది క‌మ‌ర్షియ‌ల్ ప్రేమ మాత్ర‌మేన‌ని కంగ‌న కామెంట్లు చేసింది.

అయితే వీటిని ఆ జంట అస్స‌లు మ‌ర్చిపోలేద‌న‌డానికి తాజాగా ర‌ణ‌వీర్ విసిరిన పంచ్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంద‌ని విశ్లేషిస్తున్నారు. రణవీర్ సింగ్ కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల‌తో విసిగిపోయాక‌ ఇప్పుడే 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' రూపంలో హిట్ అందుకున్నాడు. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతడు అలియా భట్‌తో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకున్నాడు. సినిమా విజయం గురించి అందరూ మాట్లాడుకుంటున్న సమయంలో రణ్‌వీర్ సింగ్ పాత వీడియో ఒకటి వెబ్‌లో ప్రత్యక్షమైంది. సినిమాలో డైలాగ్‌లను పాలిష్ చేయడం.. రివైజ్ చేయడం కోసం చిత్రంలోని నటీనటులు అదనపు క్రెడిట్‌లను తీసుకుంటున్నారని ర‌ణ‌వీర్ ఈ వీడియోలో వ్యాఖ్యానించాడు. కొన్ని సార్లు సినిమాలో అవ‌స‌రం మేర‌ తన సొంత లైన్లు రాసుకుంటానని లేదా వాటిని కొద్దిగా సర్దుబాటు చేస్తానని ర‌ణ‌వీర్ చెప్పాడు. చాలా మంది ఇతర నటీనటుల మాదిరిగా కాకుండా డైలాగ్‌లను మెరుగుపరచడంలో క్రెడిట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే ఈ త‌వ్వ‌కం కంగ‌న‌ను ఉద్దేశించేనా? అంటూ నెటిజ‌నుల్లో ఇప్పుడు పెద్ద డిబేట్ స్టార్ట‌యింది. ఈ వీడియోలో రణవీర్ సింగ్ 'రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీ' గురించి మాట్లాడాడు. కరణ్ జోహార్ త‌న‌కు అదనపు డైలాగ్ రైట‌ర్ గా క్రెడిట్స్ ఇవ్వడానికి ఆఫర్ ఇచ్చాడ‌ని కూడా ర‌ణ‌వీర్ పేర్కొన్నాడు. కానీ దానికి తాను నిరాకరించాన‌ని తెల‌పాడు.

''నిజానికి సినిమాలో ఏదో ఒకటి తీసుకుని దాన్ని మెరుగుపరచడం మా (నటీనటుల) బాధ్యత. మీరు చేయలేక కాదు.. అందుకే అదనపు డైలాగ్ క్రెడిట్ ఏదీ అక్కర్లేదు. కొంద‌రు న‌టీన‌టులు ఆ క్రెడిట్ ని తీసుకున్నారని నాకు తెలుసు.. కానీ ఇది నా శైలి కాదు'' అని ర‌ణ‌వీర్ వ్యాఖ్యానించిన క్లిప్ రెడ్డిట్‌లో వైర‌ల్ గా మారింది. ఇది కంగ‌న‌ను ఉద్దేశించి చేసిన కామెంటేనా? అంటూ నెటిజ‌నుల్లో చ‌ర్చ సాగుతోంది. ఈ వీడియోనే రిపీట్ చేస్తూ ''ఆమెను ఖంగు తినిపించాడా.. లేక మ‌రెవరైనానా?'' అనే టైటిల్‌తో అభిమానులు వీడియోను వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. అయితే కొందరు కంగనా రనౌత్ పైనే ఈ పంచ్ అంటూ వ్యాఖ్యానించారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... కంగనా రనౌత్ తదుపరి చిత్రం ఎమర్జెన్సీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీగా క్వీన్ కనిపించనున్నారు. టీజర్ లో ఇందిర‌మ్మ‌గా కంగ‌న‌ మేకోవ‌ర్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇదే కాకుండా 'తేజస్'లోను కంగ‌న న‌టిస్తోంది. ఇందులో ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. కంగనా రనౌత్ -రాఘవ లారెన్స్ కాంబినేష‌న్ లో చంద్రముఖి 2 చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. మ‌రో వైపు ర‌ణ‌వీర్ సింగ్ త‌న త‌దుప‌రి ప్రాజెక్టుని ప్ర‌క‌టించాల్సి ఉంది. అత‌డు డాన్ 3లో న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.