Begin typing your search above and press return to search.

ర‌ణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టా క్లీనింగ్ అందుకేనా?

అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ర‌ణ్వీర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ కానున్న‌ ధురంధ‌ర్ ఫ‌స్ట్ లుక్ కోసమే అత‌ను ఈ సోష‌ల్ మీడియా క్లెన్సింగ్ ను ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   6 July 2025 11:11 AM IST
ర‌ణ్‌వీర్ సింగ్ ఇన్‌స్టా క్లీనింగ్ అందుకేనా?
X

ర‌ణ్‌వీర్ సింగ్ త‌న 40వ బ‌ర్త్ డే కు చాలా త‌క్కువ స‌మ‌యం ఉంద‌న‌గా, ఓ స‌డెన్ డెసిష‌న్ తీసుకోగా, అది అత‌ని ఫ్యాన్స్ ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ర‌ణ్‌వీర్ సింగ్ త‌న ఇన్‌స్టాగ్ర‌మ్ లోని పోస్టుల‌న్నింటినీ డిలీట్ చేసి, త‌న ప్రొఫెల్ పిక్ ను కూడా ఒక డార్క్ ఇమేజ్ తో అప్‌డేట్ చేస్తూ తన ఇన్‌స్టా స్టోరీలో రెండు అడ్డంగా ఉన్న క‌త్తులు మ‌రియు 12:12 అంటూ ఓ టైమ్ ను పోస్ట్ చేశారు.

అయితే ర‌ణ్‌వీర్ చేసిన ఈ చ‌ర్య ర‌క‌ర‌కాల ఊహాగానాలకు దారి తీయ‌గా, ఈ విష‌యంలో కొంద‌రు ఫ్యాన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ, అంతా బాగానే ఉంటుంద‌ని ఆశిస్తున్నామ‌ని కామెంట్స్ చేయ‌గా, మ‌రికొంద‌రు మాత్రం ఏదో పెద్ద ప్లానే జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఓ నెటిజ‌న్ తుఫాన్ రాబోతుంద‌ని కామెంట్ చేయ‌గా, ఇంకొక‌రు ధురంధ‌ర్ 12:12 అని, మ‌రొక‌రు ర‌ణ్‌వీర్ సింగ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాన‌ని కామెంట్ చేశారు.

అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ర‌ణ్వీర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ కానున్న‌ ధురంధ‌ర్ ఫ‌స్ట్ లుక్ కోసమే అత‌ను ఈ సోష‌ల్ మీడియా క్లెన్సింగ్ ను ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ధురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ లెజండ‌రీ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ అజిత్ దోవ‌ల్ నిజ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో మాధ‌వ‌న్, సంజ‌య్ ద‌త్, యామీ గౌత‌మ్, అక్ష‌య్ ఖ‌న్నా, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ క్యాస్ట్ న‌టిస్తుండ‌గా, ర‌ణ్ వీర్ సింగ్ ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ధురంధ‌ర్ తో పాటూ ర‌ణ్‌వీర్ సింగ్, ఫ‌ర్హాన్ అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో డాన్3లో కూడా న‌టిస్తున్నారు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. గ‌తంలో ఈ ఫ్రాంచైజ్ లో షారుఖ్ ఖాన్ న‌టించగా ఇప్పుడు డాన్3 ను ర‌ణ్‌వీర్ సింగ్ చేస్తున్నారు.