స్టార్ హీరో ఇంట కొత్త కారు అసలు సంగతేంటంటే?
సెలబ్రిటీల్లో చాలా మందికి కొత్త కార్లు కొనడం అన్నా? కార్ల కలెక్షన్ అన్నా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వాళ్లలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా ఒకరు.
By: Tupaki Desk | 10 July 2025 3:15 PM ISTరాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు సెలబ్రిటీలు తలుచకుంటే కొత్త కార్లకు కొదవా! సెలబ్రిటీ కోటీశ్వరులకు లగ్జరీ కార్లు కొనడం అన్నది చిటికేసినంత ఈజీ. తలుచుకుంటే గంటల వ్యవధి లోనే కోరుకున్న కారు ఇంటి ముందు ఉంటుంది. సెలబ్రిటీల్లో చాలా మందికి కొత్త కార్లు కొనడం అన్నా? కార్ల కలెక్షన్ అన్నా చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వాళ్లలో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా ఒకరు.
ఇప్పటికే రణవీర్ సింగ్ ఇంట రేంజ్ రోవర్, లంబోర్గిని, ఆస్టన్ మార్టిన్, మెర్సిడెస్-బెంజ్, జాగ్వార్, ఆడి , టయోటాతో సహా అనేక రకాల హై-ఎండ్ కార్లు ఉన్నాయి. అయినా మార్కెట్ లోకి ఏదైనా నచ్చిన కొత్త కారు వచ్చిందంటే దాని సంగతేంటో చూడాలంటారాయన. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రీమియం బ్రాండ్ హమ్మ ర్ నుండి రిలీజ్ అయిన వాహనం ఇప్పుడు అతని ఇంటిముందు కొలువు దీరింది. అన్ని రకాల పన్నులతో సహా, ఈ కారు విలువ 5 కోట్లు అని తెలుస్తోంది.
హమ్మర్ నుండి వచ్చిన స్పెషల్ ఎడిషన్ ఇది. ఒమేగా స్పెషల్ ఎడిషన్ సిరీస్‌లో భాగంగా కంపెనీ ప్రపం చవ్యాప్తంగా 1,000 యూనిట్లను మాత్రమే తయారు చేసింది. వాటిలో ఒకటి ఇప్పుడు రణ్‌వీర్ ఇంటికి చేరింది. ఈ కారు అత్యున్నత స్థాయి లగ్జరీ , భద్రతా ప్రమాణాలను కలిగి ఉంది. ఈ కారు 4 గంటల ఛార్జింగ్ తో 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. ఇలా కార్లుకొనే అలవాటు రణవీర్ కు చాలా కాలంగా ఉంది.
ఆయన పారితోషికంలో సగ భాగం కొత్త కార్ల కోసమే కేటాయిస్తారని సమాచారం. రణవీర్ సింగ్ కెరీర్ ఆరంభంలో మారుతి సుజుకి సియాజ్‌ను కొన్నారు. ఇప్పటికీ ఆ కారు అలాగే చెక్కు చెదరకుండా గ్యారేజ్ లో ఉంది. అయితే ఈ కార్లు అన్నింటికంటే రణవీర్ ఎక్కువగా పసుపు రంగు లంబోర్గినిని ఇష్టపడతాడు.
అలాగే ఆయన హీరోగా నటిస్తోన్న 'ధురందర్' కూడా రిలీజ్ రెడీ అవుతుంది. ఈ రెండు సందర్బాల్లోనూ రణవీర్ కొత్త కారును కొనడం ఆసక్తికరం. మరి ఈ కారును భార్య దీపికా పదుకొణే గిప్ట్ గా కొనిచ్చిందా? అన్న సందేహం లేకపోలేదు.
