Begin typing your search above and press return to search.

హిట్‌ పడక నాలుగేళ్లు... ఇలాగైతే కష్టం బాసూ!

రణబీర్ కపూర్‌కి ఏమాత్రం తగ్గకుండా పలు సూపర్‌ హిట్స్‌ను అందుకున్న రణ్వీర్‌ సింగ్‌ ఈ మధ్య కాలంలో కాస్త డల్‌ కావడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 May 2025 9:30 AM
హిట్‌ పడక నాలుగేళ్లు... ఇలాగైతే కష్టం బాసూ!
X

బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరోల్లో కొద్ది మంది మాత్రమే రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారిలో రణబీర్ కపూర్‌, రణ్వీర్ సింగ్‌ ముఖ్యులు అనడంలో సందేహం లేదు. రణబీర్ కపూర్‌ యానిమల్‌ సినిమాతో పాటు పలు హిట్స్‌ను అందుకున్నాడు. కొన్ని డిజాస్టర్స్‌ ఉన్నప్పటికీ రణబీర్ కపూర్‌ జోరు కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఆయన రామాయణం సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మరోవైపు రణ్వీర్‌ సింగ్ మాత్రం కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. రణబీర్ కపూర్‌కి ఏమాత్రం తగ్గకుండా పలు సూపర్‌ హిట్స్‌ను అందుకున్న రణ్వీర్‌ సింగ్‌ ఈ మధ్య కాలంలో కాస్త డల్‌ కావడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2021లో వచ్చిన 83 సినిమాతో రణ్వీర్ సింగ్ ఆకట్టుకున్నాడు. అంతకు ముందు గల్లీ బాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఐదేళ్ల కాలంలో ఆయన నటించిన సినిమాల్లో ఏ ఒక్కటి చెప్పుకోదగ్గ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి. పైగా ఈయన హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో గెస్ట్‌ రోల్‌ చేయడం ఎక్కువ అయింది. దాంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఈయన నటించిన సింగం అగైన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో పూర్తి స్థాయి రోల్‌ కాదనే విషయం తెల్సిందే. అంతకు ముందు ఏడాదిలో రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమా వచ్చింది. ఆ సినిమా క్రెడిట్‌ ఆలియా భట్‌ లాగేసుకుంది.

మొత్తంగా రణ్వీర్ సింగ్‌ ఈమధ్య కాలంలో సినిమాల ఎంపిక విషయంలో శ్రద్ధ పెట్టడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన యాడ్స్ పై పెట్టే శ్రద్దను స్క్రిప్ట్‌ విషయంలో పెట్టడం లేదని కూడా పలువురు అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న రణ్వీర్ సింగ్‌ వాటి ఫలితంపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. వాటికి సంబంధించిన షూటింగ్ వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా ధురంధర్ సినిమా తో హిట్‌ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. గ్యాప్ వచ్చినా మంచి సినిమాతో వస్తాను అనే నమ్మకంను రణ్వీర్‌ సింగ్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సందర్భంగా వ్యక్తం చేశాడు.

మరో వైపు రణ్వీర్‌ సింగ్‌ భార్య దీపికా పదుకునే వరుస సినిమాలతో దూసుకు పోతుంది. ఆమె సినిమాల ఎంపిక, ఆమె దక్కించుకునే పారితోషికం, ఆమెకు వస్తున్న క్రేజ్‌ ఇవన్నీ మరో లెవల్‌లో ఉన్నాయంటూ అభిమానులు స్వయంగా కామెంట్‌ చేస్తున్నారు. ఆమె విషయంలో రణ్వీర్‌ సింగ్‌ ఎక్కువ శ్రద్ద పెట్టడం వల్ల తన సినిమాల విషయం పై ఫోకస్ పెట్టలేక పోతున్నాడా అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. దీపికా పదుకునేను వివాహం చేసుకున్న తర్వాత రణ్వీర్ సింగ్‌ సాలిడ్‌ సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. ఆ లోటును ఇప్పుడు కూడా భర్తీ చేసుకోలేక పోతే కచ్చితంగా ముందు ముందు విమర్శలు తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రణ్వీర్ సింగ్‌ కెరీర్‌ ఇలాగే కొనసాగితే కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.