రణ్ వీర్ `ధురందర్`కి స్ఫూర్తి?
యానిమల్ లాంటి నెగెటివ్ షేడ్ ఉన్న టైటిల్ తో రణబీర్ కపూర్ చాలా అద్భుతాలు చేసాడు.
By: Tupaki Desk | 23 April 2025 9:02 AM ISTయానిమల్ లాంటి నెగెటివ్ షేడ్ ఉన్న టైటిల్ తో రణబీర్ కపూర్ చాలా అద్భుతాలు చేసాడు. అతడు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.830 కోట్లు పైగా వసూలు చేయడం ఒక సెన్సేషన్. పంజాబ్ కి చెందిన ధనిక వ్యాపారి కుటుంబంలో జన్మించిన తుంటరి పిల్లాడు రణ్ విజయ్‌గా రణబీర్ నటనకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విమర్శల సంగతి ఎలా ఉన్నా ఈ చిత్రానికి అసాధారణ ప్రజాదరణ లభించింది.
ఒక పంజాబీ యువకుడి కథను మాస్ ఎలిమెంట్స్ అద్ది తెరపై యాక్షన్ ఎంటర్ టైనర్ గా చూపిస్తే ఏ రేంజులో వర్కవటవుతుందో ఈ సినిమా నిరూపించింది. అయితే రణవీర్ సింగ్ ఇదే ఎలిమెంట్ ని కాపీ కొడుతున్నట్టు అనిపిస్తోంది. నిజానికి యానిమల్ సక్సెస్ చూసిన తర్వాత రణ్ వీర్ కూడా పంజాబీ యువకుడిగా నటించాలని అనుకోవడంతో చాలా అనుమానాలను రేకెత్తిస్తోంది.
రణ్ వీర్ సింగ్ ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న `ధురందర్` పోస్టర్లు, లీకైన వీడియోలు చూడగానే, మరో పంజాబీ ధురందరుడి కథ ఇదని అంతా భావించారు. నిజానికి ధురంధర్ అనే టైటిల్ పెట్టలేదు కానీ, యానిమల్ లో రణబీర్ పాత్ర ధురందరుడి వంటిదే. అతడి చేష్టలు, పగ ప్రతీకారం యాక్షన్ ప్రతిదీ దురంధరుడి వ్యవహారంగానే కనిపిస్తుంది. అయితే సహచర నటుడైన రణబీర్ నింపిన స్ఫూర్తితో ఇప్పుడు రణ్ వీర్ సింగ్ ధురందరుడిగా కనిపిస్తున్నాడా? లేదూ తనకంటూ ఒక సపరేట్ రూట్ ఉందని ఈ సినిమా కథాంశం, పాత్ర తీరుతెన్నులు నిరూపిస్తాయా? అన్నది వేచి చూడాలి. లీకైన ఫోటోలు వీడియోలను బట్టి ధురందర్ భారీ యాక్షన్ సినిమా. ప్రమాదకర శత్రువులతో పోరాడే పవర్ ఫుల్ ఆఫీసర్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇంతకుముందు మీడియాలో కథనాలొచ్చాయి. ఆ రకంగా ఇది కథ పరంగా వేరియేట్ అయితే ప్రజలకు సరికొత్త వినోదాన్ని అందిస్తుందేమో వేచి చూడాలి.
ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ధురందర్ కి ప్రధాన బలం. ఈ సినిమా కథాంశం 1970లు 80లలో సాగుతుంది. షూటింగ్ 70 శాతం పూర్తయింది. ఈ సంవత్సరం జూలై నాటికి పూర్తి చేసి 2026 మార్చి లేదా జూన్ నాటికి విడుదల చేయాలనేది ప్లాన్.
