భర్త బర్త్ డేకి విష్ చేయని నటి.. లాజిక్ వెతికిన నెటిజన్
అయితే ఎవరు ఎలా స్పందించినా కానీ, ఈ టీజర్ గురించి కానీ, రణ్ వీర్ గురించి కానీ దీపిక పదుకొనే ప్రస్థావించలేదు. కనీసం తన సోషల్ మీడియాల్లో టీజర్ ని షేర్ చేయలేదు. అలాగే రణ్ వీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు.
By: Tupaki Desk | 8 July 2025 9:10 AM ISTరణ్వీర్ సింగ్ వయసు ఇప్పుడు 40. అక్షరాలా నలభై. ఈసారి బర్త్ డేకి అతడు నటించిన కొత్త సినిమా టీజర్ విడుదలైంది. రణ్ వీర్ తాజా చిత్రం 'ధురంధర్' పాథ్ బ్రేకింగ్ మూవీగా అతడి కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోనుందని చాలా చర్చ సాగుతోంది. ధురంధర్ టీజర్ పుట్టినరోజు కానుకగా విడుదలై సంచలనం సృష్టించింది. వెబ్‌లో ఇది దూసుకుపోతోంది. ధురంధర్ టీజర్ లో రణ్ వీర్ నటన, వేషధారణ, కంటెంట్ చాలా ఆశ్చర్యపరిచాయి. దర్శకుడు ఆదిత్యాధర్ ఈసారి ఒక కొత్త జానర్ లో రణ్ వీర్ ని ఆవిష్కరిస్తున్నాడని ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రణ్‌వీర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎవరు ఎలా స్పందించినా కానీ, ఈ టీజర్ గురించి కానీ, రణ్ వీర్ గురించి కానీ దీపిక పదుకొనే ప్రస్థావించలేదు. కనీసం తన సోషల్ మీడియాల్లో టీజర్ ని షేర్ చేయలేదు. అలాగే రణ్ వీర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు.
దీనిపై రెడ్డిటర్లు ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నారు. రణ్ వీర్ కి దీపిక కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. ఈ సినిమా లుక్ గురించి ఎలాంటి పోస్ట్ చేయలేదు.. దీపిక గురించి రణ్వీర్ ప్రతిదీ గూ గాగా తరహాలో సందడి చేస్తాడు. ఆమె తన భర్తను కొంచెమైనా అభినందించాల్సింది! అంటూ ఒక నెటిజన్ రాసాడు. దీపిక మనస్తత్వాన్ని కాఠిన్యాన్ని అతడు నిలదీసాడు.
అయితే సోషల్ మీడియాలో అన్నిటినీ పోస్ట్ చేయరని చాలా మంది నెటిజనులు ఈ వ్యాఖ్య చేసిన వ్యక్తిపై విరుచుకుపడ్డారు. మన జీవితాల్లో చాలా విషయాలను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయలేమని కూడా అన్నారు. దీపిక నటించిన `ఫైటర్` మూవీ గురించి రణ్ వీర్ ఏదీ పోస్ట్ చేయలేదు.. అలాగని బాంధవ్యం లేదని అంటారా? అంటూ ఒక నెటిజన్ రాసాడు. సోషల్ మీడియాలపై అనవసరంగా ఎక్కువ దృష్టి పెట్టొద్దని కూడా కొందరు వ్యాఖ్యానించారు.
ధురంధర్ ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రజల్లోకి దూసుకెళ్లింది. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందరూ రణ్‌వీర్ నటన ఎనర్జీని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో సారా అర్జున్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా లాంటి గ్రేట్ యాక్టర్స్ నటిస్తున్నారు. విక్కీ కౌశల్ నటించిన `యూరి: ది సర్జికల్ స్ట్రైక్` చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 5 డిసెంబర్ 2025న ఈ సినిమా విడుదల కానుంది.
