సీఎం పేషీకి చేరిన 'ధురంధర్' వివాదం!
ఇదిలా ఉంటే రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ పార్ట్ 2కు సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్‌ని ముంబైలో చేస్తున్నారు. ఛారిత్రాత్మక ఫోర్ట్ ఏరియాల్లో దీనికి సంంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది.
By: Ravindar Gorantla | 18 Feb 2026 3:37 PM ISTబాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో రణ్‌వీర్ సింగ్ ఒకరు. ఆయన కథానాయకుడిగా నటించిన భారీ బ్లాక్ బస్టర్ `ధురంధర్`. ఆదిత్యధర్ రూపొందించిన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సాధించిన కలెక్షన్‌ల వర్షం కురిపించింది. భారత్‌పై పాక్ చేస్తున్న దుష్ట పన్నాగాలని ఎండగడుతూ ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపింది. దీంతో పార్ట్ 2గా రానున్న `ధురంధర్ 2 ది రివేంజ్`పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ నేఫథ్యంలోనే ఈ మూవీని మార్చి 19న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించి ఇటీవలే టీజర్, ట్రైలర్‌లని విడుదల చేసి సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేశారు.
ఇదిలా ఉంటే రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ పార్ట్ 2కు సంబంధించిన బ్యాలెన్స్ షూటింగ్‌ని ముంబైలో చేస్తున్నారు. ఛారిత్రాత్మక ఫోర్ట్ ఏరియాల్లో దీనికి సంంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ జరుగుతోంది. అయితే అనుమతి లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారని, పలు దఫాలుగా చిత్ర బృందాన్నిహెచ్చరించి జరిమానా విధించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రీసెంట్‌గా ఈ సినిమా నిర్మాణ సంస్థ బి62ని ముంబైలో ఎలాంటి షూటింగ్‌లు చేసుకోవడాపికి వీలు లేకుండా కంప్లీట్‌గా బ్యాన్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్న విషయం తెలిసిందే.
ఈ వివాదంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ స్పందించింది. దీంతో వివాదం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేషీకి చేరింది. తాజా వివాదంపై స్పందించిన ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ నిబంధనలు ఉల్లంఘింస్తే కఠిన చర్యలు అమలు చేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాసింది. చిత్ర పరిశ్రమలో కొన్ని వేల మంది పని చేస్తున్నారు. కార్మికులు, సాంకేతిక నిపుణుల జీవితం, వారి భద్రత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడకూడదు. ఎన్నో సంవత్సరాలుగా చిత్ర నిర్మాణ సంస్థలు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని మేం ఆందోళన చెందుతూనే ఉన్నాం.
ఈ అంశంపై ఎన్నో సార్లు పోరాటాలు చేశాం. చిత్ర బృందాల నిర్లక్ష్యం వల్ల ఏటా ఎంతో మంది కార్మికులు మరణిస్తున్నారు. బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఆలోచనకు మేం పూర్తి మద్దతునిస్తున్నాం. ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా చట్టానికి అతీతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేం కోరుతున్నాం` అంటూ లేఖ రాశారు. ఇది `ధురంధర్ 2` మేకర్స్‌పై పిడుగులా మారే అవకాశంఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. గోరు చుట్టు రోకలి పోటులా ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వ్యవహరించిన తీరు ఉందని బాలీవుడ్ మేకర్స్ వాపోతున్నారు.
వివాదం ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ దాటి ముంబై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేచీకి చేరడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి భారత్‌కు వ్యతిరేకంగా పాక్ పన్నిన కుట్రలని బట్టబయలు చేసిన ఈ మేకర్స్ ని కాదని మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయాన్ని సమర్దిస్తారా? లేక `ధురంధర్` మేకర్స్‌కి అనుకూలంగా వ్యవహరిస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏం జరగనుందన్నది తెలియాలంటే దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
