బిగ్ న్యూస్: రణ్‌వీర్ సింగ్ సరసన శ్రీలీల?
ఇటీవల రణ్‌వీర్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం ధురంధర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
By: Tupaki Desk | 4 July 2025 2:20 PM ISTఇటీవల రణ్‌వీర్ సింగ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం ధురంధర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్‌లో కనిపించడం ఆశ్చర్యపరిచింది. అతడు ఒక పెద్ద నిర్మాణ సంస్థలో అత్యంత భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడంటూ కథనాలొచ్చాయి.
అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. రణ్‌వీర్ ఈసారి ఫీచర్ ఫిలిం కోసం కాదు కానీ, అతడు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించనున్నాడు. `చింగ్స్ సీక్రెట్` ఉత్పత్తికి సంబంధించిన భారీ బడ్జెట్ అడ్వెర్టైజ్‌మెంట్ అని తెలుస్తోంది. రణ్ వీర్‌ని ఎప్పటిలాగే మరోసారి విచిత్రమైన అవతార్ లో చూడగలమని కూడా చెబుతున్నారు.
ప్రకటనలో రణ్‌వీర్, బాబీ డియోల్, రాజ్‌పాల్ యాదవ్‌లతో కూడిన బృందానికి రణ్ వీర్ నాయకత్వం వహిస్తాడు. కెప్టెన్ చింగ్ ఈజ్ బ్యాక్! అంటూ ప్రకటన రూపకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇది ఒక యాక్షన్-కామెడీ కోలాహలం అని చెబుతున్నారు. అట్లీ మార్క్ ఫ్లెయిర్ తో కామిక్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమైంది. కేవలం నాలుగు రోజుల్లో చిత్రీకరణ పూర్తి కానుంది.
ఆసక్తికరంగా ఈ వాణిజ్య ప్రకటనలో రణ్ వీర్ తో పాటు తెలుగు నటి, ప్రతిభావంతురాలైన శ్రీలీల నటిస్తోందని సమాచారం. ఈ బ్యూటీ ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ సరసన ఓ క్రేజీ రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తోంది. అదే సమయంలో రణ్ వీర్ తో వాణిజ్య ప్రకటనలో అవకాశం అందుకుంది. ఈ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత హిందీలో అగ్ర హీరోల సరసనా అవకాశాలు అందుకునే ఛాన్సుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ హై ఆక్టేన్ యాక్షన్ తో కూడుకున్న యాడ్ కావడంతో శ్రీలీలకు ఎలివేషన్ ఉంటుందని భావిస్తున్నారు. గతంలో చింగ్ ప్రకటనలకు అలీ అబ్బాస్ జాఫర్, రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆ అవకాశం అట్లీని వరించింది. అట్లీ ఓవైపు అల్లు అర్జున్ తో భారీ సినిమాని పూర్తి చేస్తూనే గ్యాప్ లో ఈ ప్రకటన రూపొందిస్తున్నాడని సమాచారం.
