గ్రేట్ కంబ్యాక్ కోసం స్టార్ హీరో పాట్లు
వీటన్నిటికీ మించి ఎనర్జిటిక్ రణ్ వీర్ మరో భారీ ప్రాజెక్ట్ ని సీక్రెట్ గా మొదలు పెట్టాడని గుసగుస వినిపిస్తోంది. అతడు ప్రతిష్ఠాత్మక మెహబూబ్ స్టూడియోస్ ప్రాంగణంలో కనిపించాడు.
By: Tupaki Desk | 3 July 2025 5:00 AM ISTకొన్ని వరుస పరాజయాల తర్వాత అన్నిటి నుంచి బయటపడేందుకు ఈ స్టార్ హీరో శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అతడు బాలీవుడ్ లో కలిసి రాకపోవడంతో దక్షిణాది దర్శకులతో అయినా సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరాడు. కానీ దురదృష్ట వశాత్తూ ఇక్కడ ఆశించినది జరగలేదు. శంకర్ దర్శకత్వంలో అన్నియన్ (అపరిచితుడు) రీమేక్ లో నటించాలనుకున్నాడు. ప్రయత్నాలు మొదలు పెట్టినా కానీ ఎందుకనో మిడిల్ డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత `హనుమాన్` తో పాన్ ఇండియాలో సంచలనం సృష్టించిన తెలుగు యువదర్శకుడు ప్రశాంత్ వర్మతో ప్రాజెక్ట్ చేయాలని ఉవ్విళ్లూరాడు. కానీ దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ లేకపోవడంతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ లేదు. ఇంతకీ ఈ హీరో ఎవరో చెప్పాల్సిన పని లేదు. కచ్ఛితంగా అది రణ్ వీర్ సింగ్.
దక్షిణాదిన కొన్ని భారీ ప్రయత్నాల తర్వాత తిరిగి అతడు బాలీవుడ్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు అతడి చేతిలో 1000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ఉన్నాయి. అతడు స్పై యాక్షన్ చిత్రం -దురంధర్ లో నటిస్తున్నాడు. యూరి ఫేం ఆదిత్యా ధర్ రూపొందిస్తున్న ఈ సినిమాకి సుమారు 150కోట్లు పైగా బడ్జెట్ ఖర్చవుతుందని అంచనా. తదుపరి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో డాన్ 3 అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనుంది. దీనికోసం సుమారు 300 కోట్లు ఖర్చు చేస్తారని టాక్ ఉంది. మరోవైపు మడాక్ ఫిలింస్ తో హారర్ విశ్వంలో రణ్ వీర్ అడుగుపెడుతున్నాడని ఈ మూవీ బడ్జెట్ రేంజ్ 200కోట్లు ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకపోయినా అతడు సక్సెస్ జోరుమీదున్న మడాక్ తో సినిమా చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
వీటన్నిటికీ మించి ఎనర్జిటిక్ రణ్ వీర్ మరో భారీ ప్రాజెక్ట్ ని సీక్రెట్ గా మొదలు పెట్టాడని గుసగుస వినిపిస్తోంది. అతడు ప్రతిష్ఠాత్మక మెహబూబ్ స్టూడియోస్ ప్రాంగణంలో కనిపించాడు. అక్కడ గట్టి భద్రత నడుమ కనిపించాడు.. ఇంకా ఈ ప్రాజెక్ట్ వివరాలను రహస్యంగా ఉంచడం ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ ఇది నిజమే అయితే, మరో 200కోట్ల బడ్జెట్ సినిమా చేస్తున్నట్టేనని ఊహిస్తున్నారు. ఎలా చూసినా రణ్ వీర్ సుమారు 1000 కోట్ల రేంజు ప్రాజెక్టులను ప్రస్తుతానికి లీడ్ చేస్తున్నాడు.
కనీసం అరడజను ఫ్లాపుల తర్వాత రణ్ వీర్ సింగ్ భారీ కంబ్యాక్ కోసం ఆశిస్తున్నాడు. అందువల్ల అతడు ప్రతిదీ ఆచితూచి తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు. తనకు కచ్ఛితంగా హిట్టిచ్చే దర్శకనిర్మాతలు నిర్మాణ సంస్థల చుట్టూనే తిరుగుతున్నాడు. ప్రస్తుతానికి, రణవీర్ ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన స్పై-యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ చిత్రీకరణలో ఉన్నాడు. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా , ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇది భారీ పెద్ద యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. దీనిపై రణ్ వీర్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇది ఒక నిజ జీవిత గూఢచారి కథతో రూపొందుతోందన్న ప్రచారం నడుమ పెద్ద విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
