స్టార్ హీరో డాటర్ కు మామ్ గా హాట్ లేడీ!
షారుక్ ఖాన్ , సుహాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో `కింగ్` చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 19 May 2025 6:00 PM ISTషారుక్ ఖాన్ , సుహాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో `కింగ్` చిత్రానికి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొణే , అభిషేక్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా షారుక్ గురువు పాత్ర లో అనీల్ కపూర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే ఏడాది పట్టాలెక్కిం చాలని సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హాట్ సెరైన్ రాణీ ముఖర్జీ ని ఓ కీలక పాత్రకు తీసుకుంటున్నారు.
సుహానాఖాన్ తల్లి పాత్రలో అమ్మడు కనిపించనుందని సమాచారం. దీంతో మరోసారి షారుక్ జోడీ పాత్రలో రాణీ ముఖర్జీ కనిపించనున్నారని తెలుస్తోంది. `కింగ్` చిత్రంలో షారుక్ కుమార్తె పాత్రలోనే సుహానా కనిపించనుంది. అయితే అది ప్లాష్ బ్యాక్లో ఉంటుందా? రన్నింగ్ స్టోరీలోనా? అన్నది క్లారిటీ లేదు. దీపికా పదుకొణే కూడా ఓహీరోయిన్ గా నటిస్తుంది. ఆ పాత్ర రన్నింగ్ స్టోరీలో కనిపించే అవకాశం ఉంది.
ఇక రాణీ ముఖర్జీ తో షారుక్ ఎన్నో క్లాసిక్ హిట్లు అందుకున్నారు. `కుచ్ కుచ్ హోతా హై`, `కభీ కుషీ కభీ ఘమ్`, `చల్తే చల్తే`, `కభీ అల్వీదా నా కెహ్నా` లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడా మ్యాజిక్ ని రిపీట్ చేస్తున్నారు. సిద్దార్ధ్ ఆనంద్ ఆమెని పట్టుబట్టి ఒప్పిస్తున్నట్లు తెలుస్తోంది. రాణీ ముఖర్జీ కొంత కాలంగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేస్తుంది.
సోలోగానే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడానికి చూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన కమర్శియల్ చిత్రాల అవకాశాలను వదులుకుంటున్నారు. కానీ షారుక్ ఖాన్ తో ఉన్న పరిచయం, స్నేహం కారణంగా `కింగ్` అవకాశాన్ని తిరస్కరించలేదు. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
