Begin typing your search above and press return to search.

శ్రద్దా దాస్ రంగీలా బీట్.. మత్తుగా కిక్కిచ్చేలా..

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న శ్రద్ధదాస్ అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలతో సరికొత్తగా కనిపిస్తోంది

By:  Tupaki Desk   |   4 March 2024 7:50 AM GMT
శ్రద్దా దాస్ రంగీలా బీట్.. మత్తుగా కిక్కిచ్చేలా..
X

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటున్న శ్రద్ధదాస్ అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలతో సరికొత్తగా కనిపిస్తోంది. వీలైనంతవరకు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలే చేయాలని చూస్తున్నా ఈ బ్యూటీ ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటించిన కొత్త సినిమా పారిజాత పర్వం అనే టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమాలో శ్రద్ధదాస్ ఒకవైపు తన గ్లామర్ ను హైలైట్ చేస్తూనే మరొకవైపు తన పాత్రతో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. రీసెంట్ గా ఈ సినిమాలోని ఒక పాటను విడుదల చేశారు. రంగ్ రంగ్ రంగీలా అనే ఆ పాటను శ్రద్ధదాస్ పాడడం విశేషం. వినేవారికి మత్తుగా ఉండేలా అమ్మడు ఈ పాటను ఆలపించింది. ఇక పాటలో మరొకవైపు తన డాన్స్ స్టెప్పులతో కూడా మాయ చేసింది. చూస్తుంటే అమ్మడు నెవ్వర్ బిఫోర్ అనేలా దర్శనం ఇవ్వబోతున్నట్లు అనిపిస్తుంది.

ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు తనలోని నటిని హైలెట్ చేస్తూ వచ్చిన అమ్మడు ఇప్పుడు సింగర్ గా కూడా సరికొత్తగా దర్శనమిచ్చింది. సరస్వతి పుత్ర రామ జోగయ్యశాస్త్రి రచించిన ఈ పాటకు రే సంగీతం అందించాడు. ఇక సినిమాను వనమాలి క్రియేషన్స్ పై మహిధర్ రెడ్డి దివేష్ నిర్మిస్తూ ఉండగా అనంత సాయి సహనిర్మాతగా ఉన్నారు.

ఇక ఈ సినిమాను సంతోష్ కండుపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకునే మళ్లీ ఫామ్ లోకి రావాలి అని శ్రద్ధదాస్ ప్రయత్నం చేస్తోంది. చాలా యంగ్ ఏజ్ లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రద్దా 2008లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు వారికి పరిచయమయ్యింది. ఆ సినిమా మంచి టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ తరువాత వరుసగా రెండేళ్ల వరకు అమ్మడు గ్యాప్ లేకుండా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. ఇక ఇప్పుడు పారిజాత పర్వం అనే సినిమాతో మళ్లీ చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితన్ని అందుకుంటుందో చూడాలి.