Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్ కోసం సుక్కూ ఎలాంటి క‌థతో?

అలాంట‌ప్పుడు రామ్ చ‌ర‌ణ్ కోసం సుకుమార్ ఎలాంటి క‌థ‌ను ఎంపిక చేసుకుంటున్నాడు? ఇప్పుడు ఇదే చ‌ర‌ణ్ అభిమానుల్లో ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌.

By:  Tupaki Desk   |   25 March 2024 5:41 PM GMT
రామ్ చ‌ర‌ణ్ కోసం సుక్కూ ఎలాంటి క‌థతో?
X

గ్యాంగ్ స్ట‌ర్ డ్రామాలు .. గ‌నుల్లో మాఫియా అరాచ‌కాలు.. హిస్టారిక‌ల్ క‌థ‌లు.. క్రీడా నేప‌థ్య క‌థ‌లు.. ప్రేమ‌క‌థ‌లు.. అడ‌వుల్లో స్మ‌గ్ల‌ర్ల క‌థ‌లు వ‌గైరా రొటీన్ గా మారాయి. అలాంట‌ప్పుడు రామ్ చ‌ర‌ణ్ కోసం సుకుమార్ ఎలాంటి క‌థ‌ను ఎంపిక చేసుకుంటున్నాడు? ఇప్పుడు ఇదే చ‌ర‌ణ్ అభిమానుల్లో ఎదుర‌వుతున్న ప్ర‌శ్న‌.


చ‌ర‌ణ్ ఇప్ప‌టికే సుకుమార్ తో గోదారి నేప‌థ్యంలో నేటివిటీ సినిమా చేసాడు. రంగ‌స్థ‌లం చ‌ర‌ణ్ కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు శంక‌ర్ తో పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ చేస్తున్నాడు. అందువ‌ల్ల అత‌డు ఈసారి ఎంపిక చేసుకునే పాయింట్ త‌ప్ప‌నిస‌రిగా యూనిక్ గా ఉండాలి. చ‌ర‌ణ్ ఇప్ప‌టివ‌ర‌కూ మాఫియా క‌థ‌లు, స్మగ్ల‌ర్ల క‌థ‌లు, గూండారాజ్ క‌థ‌లు చేయ‌లేదు. నిధులు ఉండే కేజీఎఫ్ గ‌నుల్లో, గంధ‌పు చ‌క్క‌ల అడ‌వుల్లోను తిర‌గ‌లేదు. కాబ‌ట్టి వాటితో ఏదైనా ట్రై చేద్దామా? అంటే ఇప్ప‌టికే మ‌న ద‌ర్శ‌కులంతా ఇలాంటి క‌థ‌ల్ని గొప్ప గా తెర‌కెక్కించేయ‌డంతో ఇప్పుడు చ‌ర‌ణ్ కి ఎలాంటి క‌థ‌ను సుకుమార్ ఎంపిక చేస్తున్నాడు? అన్న‌ది సందిగ్ధంగా మారింది.


ఫ‌క్తు ప్రేమ‌క‌థ‌లోనో, రొమాంటిక్ కామెడీ క‌థ‌లోనో చ‌ర‌ణ్ ని చూపిస్తే అదేమంత మైలేజ్ ని ఇవ్వ‌దు అనే అనుమానాలున్నాయి. ఇలాంట‌ప్పుడు సుకుమార్ ఎలాంటి క‌థ‌తో వ‌స్తాడు? అది కూడా భారీగా మాస్ ని థియేట‌ర్ల‌కు రిపీటెడ్ గా ర‌ప్పించే క‌థ‌, యాక్ష‌న్ కావాలి.

రామ్ చరణ్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇటీవల కొత్త చిత్రం RC 16 ప్రారంభ‌మైంది. హోలీ పండుగ సందర్భంగా రామ్ చ‌ర‌ణ్ సుకుమార్ తో తన కొత్త సినిమాని ప్ర‌క‌టించాడు. హోలీ రోజున సుకుమార్ - రామ్ చ‌ర‌ణ్ క‌లుసుకున్న ఓ ఫోటోని కూడా షేర్ చేయ‌డంతో ఆసక్తిని రేకెత్తించింది.

RC17 కోసం సుకుమార్ - DSP

రామ్ చ‌ర‌ణ్‌ తన ఇన్‌స్టాలో #RC17 ది ఫోర్స్ రీయునైట్స్ అని రాశాడు. ఒక స్లైడ్ లో సుకుమార్ తో ఫోటో, సెకండ్ స్లైడ్‌లో ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ షేర్ చేశారు. రామ్, సుకుమార్, DSP (దేవి శ్రీ ప్రసాద్) ముగ్గురూ `రంగస్థలం` లాంటి క్లాసిక్ హిట్ చిత్రాన్ని అందించారు. తదుపరి వెంచర్ RC17ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. నటీనటుల వివ‌రాల్ని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. చ‌ర‌ణ్ 17వ సినిమాని 2025 చివరి త్రైమాసికంలో పాన్ ఇండియాలో విడుదలవుతుంది.

రామ్ చరణ్ RC16కి సుకుమార్ మద్దతు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఆర్‌సి 16కి సుకుమార్ ప్ర‌ధాన స‌హ‌కారి. ఇది వృద్ధి సినిమాస్ -సుకుమార్ రైటింగ్స్ సంయుక్త వెంచర్. ఇటీవ‌లే ఈ సినిమా ప్రారంభ‌మైంది.