గద్దర్ అవార్డులపై రంగస్థలం ఎఫెక్ట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాను ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాలో చిట్టి బాబు గా రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు.
By: Tupaki Desk | 31 May 2025 4:05 PM ISTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాను ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాలో చిట్టి బాబు గా రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. చాలా మంది తెలుగు ఆడియన్స్ ఇప్పటికీ రంగస్థలం సినిమాను చూసి ఆశ్చర్యపోతారు. గోదావరి జిల్లాల్లో ఉండే ఓ చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ ఆ సినిమాలో ఎంతో గొప్ప పెర్ఫార్మెన్స్ ను కనబరిచాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే రామ్ చరణ్ కెరీర్ రంగస్థలం సినిమాకు ముందు ఒకలా, రంగస్థలం సినిమాకు తర్వాత ఒకలా మారింది. రంగస్థలం లాంటి సినిమా చేసినందుకు చరణ్ ను చాలా మంది గౌరవిస్తారు కూడా. చిట్టిబాబుగా చరణ్ స్క్రీన్ పై జీవించడమే కాకుండా అతని యాక్టింగ్ ఆడియన్స్ ను 1980ల నాటికి తీసుకెళ్లి రంగస్థలంను మరింత స్పెషల్ గా మార్చింది.
ఆ సినిమాలో రామ్ చరణ్- సమంత కెమిస్ట్రీ, ఆది పినిశెట్టితో బ్రొమాన్స్ సినిమాను చాలా ఎమోషనల్ గా మార్చి ఆడియన్స్ తో పాటూ గద్దర్ అవార్డుల జ్యూరీ మెంబర్స్ పై కూడా ప్రభావం చూపింది. అందుకే 2018 సంవత్సరానికి గానూ తెలంగాణ ప్రభుత్వం రంగస్థలం సినిమాను రెండవ ఉత్తమ చలనచిత్రంగా ప్రకటించింది. రంగస్థలం కథను, అందులోని పాత్రలను సుకుమార్ తీర్చిదిద్దిన విధానం కూడా ఎంతో రియలిస్టిక్ గా ఉంటుంది.
సుకుమార్ కథకు దేవీ శ్రీ ప్రసాద్ తన సంగీతంతో ప్రాణం పోయగా, సినిమాటోగ్రఫర్ రత్నవేలు అద్భుతమైన విజువల్స్ తో దాన్ని నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కించాడు. ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ కు ఇలాంటి క్లాసిక్ సినిమాను అందించనందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానికి తగ్గ గుర్తింపు లభించింది.
