ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో!
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా పరిచయం అవసరం లేదు. నటుడిగా చాలా సినిమాలు చేసాడు. కెరీర్ ప్రారంభమై 25 ఏళ్లు అవుతుంది.
By: Tupaki Desk | 15 April 2025 10:00 PM ISTబాలీవుడ్ నటుడు రణదీప్ హుడా పరిచయం అవసరం లేదు. నటుడిగా చాలా సినిమాలు చేసాడు. కెరీర్ ప్రారంభమై 25 ఏళ్లు అవుతుంది. `మాన్సూన్ వెడ్డింగ్` తో కెరీర్ మొదలు పెట్టాడు. అటుపై `డీ`, `రిస్క్`, `ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై,` `జన్నత్ -2` , `కాక్ టెయిల్`, `జిస్మ్-2`, `హీరోయిన్`, `మర్డర్ 3` ఇలా చాలా సినిమాలు చేసాడు. కెరీర్ లో ఏదశలోనూ ఖాలీ లేకుండా పని చేసాడు. స్టిల్ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడు.
నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంది. అలాంటి నటుడు సొంత పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. సొంత పరిశ్రమే తనని పట్టించుకోలేదని ఆవేదన చెందాడు. పరాయి వాళ్లకు ఉన్న అభిమానం కూడా సొంత భాషలో వాళ్లు చూపించలేకపోతున్నారన్నాడు. నటుడిగా తాను మంచి సినిమాలు చేస్తూ సక్సెస్ అవ్వడం బాలీవుడ్ లో కొందరికి ఇష్టం లేదన్నాడు.
తన ఎదుగదలను ఓర్వలేక ఒకవేళ ప్రశంసిస్తే ఇంకా పై స్థాయికి వెళ్తాడు అనే అక్కసుతో ప్రశంస కూడా నోచుకోవడం లేదని ఆరోపించాడు. కానీ తెలుగు నుంచి మంచి ప్రశంసలొస్తున్నాయన్నాడు. తనని బాలీవుడ్ పట్టించుకోకపోయినా టాలీవుడ్ నుంచి గొప్ప గౌరవం దక్కడం సంతోషంగా ఉందన్నాడు. ఇటీవల రిలీజ్ అయిన `జాట్` సినిమాలో రణదీప్ హుడా విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా మంచి విజయం సాధించింది. అందులో రణదీప్ పాత్రకు మంచి పేరొచ్చింది. దీంతో తెలుగు ఆడియన్స్ హుడాని మెచ్చుకున్నారు. కానీ హిందీ నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మొత్తానికి రణదీప్ హుడా రూపంలో బాలీవుడ్ మరోసారి విమర్శలకు గురవుతుంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ తీరును అక్కడ టాప్ స్టార్లే ఎండగడుతోన్న సంగతి తెలిసిందే.
