Begin typing your search above and press return to search.

ర‌ణ‌బీర్ - విక్కీ స్నేహం.. ఇదేనా విసిత్రం అంటే!

ఇంత‌కీ ఇది ఏ ఇద్ద‌రు స్నేహితుల గురించి? అంటే... క‌చ్ఛితంగా ర‌ణ‌బీర్ క‌పూర్- విక్కీ కౌశ‌ల్ స్నేహం గురించే

By:  Tupaki Desk   |   23 Jan 2024 2:33 PM GMT
ర‌ణ‌బీర్ - విక్కీ స్నేహం.. ఇదేనా విసిత్రం అంటే!
X

అత‌డు ఆమెకు మాజీ ప్రియుడు. కానీ ఇప్పుడు ఆమె భ‌ర్త‌కు మంచి స్నేహితుడు! ఇది వినేందుకు కొంత క్రిప్టిక్ గా క్రిటిక‌ల్ గా అనిపించినా కానీ ఇదే నిజం. రామ‌మందిర ప్రారంభోత్స‌వం వేళ ఆ ఇద్ద‌రూ త‌మ స్టార్ వైవ్స్ తో క‌లిసి ఉత్స‌వంలో పాల్గొన్నారు. వేదిక వ‌ద్ద నవ్వులు చిందిస్తూ ఇరు కుటుంబాలు కార్య‌క్ర‌మాన్ని ఆస్వాధిస్తున్న వైనం కంటే.. ఆ ఇద్ద‌రూ స్నేహితులుగా క‌లిసిమెలిసి క‌నిపించ‌డ‌మే ఎక్కువ‌గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇంత‌కీ ఇది ఏ ఇద్ద‌రు స్నేహితుల గురించి? అంటే... క‌చ్ఛితంగా ర‌ణ‌బీర్ క‌పూర్- విక్కీ కౌశ‌ల్ స్నేహం గురించే...


రామ‌మందిర పూజోత్సవ కార్య‌క్ర‌మాల వేదిక వ‌ద్ద ర‌ణ‌బీర్ నేరుగా విక్కీ కౌశ‌ల్ భుజాల మీదుగా చేయి వేసి ఎంతో ఆప్యాయంగా క‌లిసిపోయాడు. ఆ ఇద్దరి చెంతా స‌తీమ‌ణులు న‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. ర‌ణ‌బీర్ - ఆలియా, విక్కీ - క‌త్రిన‌ దంప‌తులు ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కాగా, వారి చిలిపి చేష్ట‌లు స‌ర‌దా ఆట‌లు కూడా ఇక్క‌డ హైలైట్ అయ్యాయి. ఈ స్నేహం సిత్రంగా విచిత్రంగా ఉందిలే! అంటూ తెలిసిన వారంతా ఇప్పుడు గుస‌గుస‌లాడుతున్నారు.

విక్కీ కౌశ‌ల్ ని పెళ్లాడ‌క ముందు క‌త్రిన కైఫ్ చాక్లెట్ బోయ్ ర‌ణ‌బీర్ క‌పూర్ తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ క‌త్రిన అత‌డి నుంచి బ్రేక‌ప్ అయి, త‌ర్వాత విక్కీకి స‌న్నిహితురాలైంది. ఆ ఇరువురూ చాలా కాలం పాటు డేటింగ్ చేసాక పెళ్లి చేసుకున్నారు. ఇక క‌త్రిన‌, దీపిక లాంటి అగ్ర నాయిక‌ల‌తో ప్రేమాయ‌ణాలు సాగించిన ర‌ణ‌బీర్ క‌పూర్, ఆ త‌ర్వాత ఇద్ద‌రికీ బ్రేక‌ప్ చెప్పి ఆలియా భ‌ట్ తో ప్రేమ‌క‌థ‌ను మొద‌లెట్టాడు. ఇది స‌క్సెసై చివ‌రికి ఆలియాను ర‌ణ‌బీర్ సీరియ‌స్ గా పెళ్లాడేసాడు. ఇప్పుడు ఈ జంట‌కు ఒక బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. క‌త్రిన ఇంకా త‌న తొలి బిడ్డ గురించి ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.