Begin typing your search above and press return to search.

ప్రియురాలిని మ‌రీ చీప్ గర్ల్ అనేసాడు

ఈ మొత్తం ఎపిసోడ్ ఎవ‌రి గురించి అంటే.. ర‌ణ‌బీర్ క‌పూర్- దీపిక ప‌దుకొనే- క‌త్రిన గురించే.

By:  Tupaki Desk   |   19 March 2024 2:01 PM GMT
ప్రియురాలిని మ‌రీ చీప్ గర్ల్ అనేసాడు
X

ఆ ఇద్ద‌రూ ఒక‌ప్పుడు వీర ప్రేమికులు. ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేనంత ప్రేమ‌. కానీ అనుకోని రీతిలో విధి వ‌క్రించింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్య‌లోకి కొత్త‌ భామ ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత అన్ని ప్రేమ‌క‌థ‌ల్లానే బ్రేక‌ప్ అయింది. కాల‌క్ర‌మంలో ఈ ముక్కోణ ప్రేమ‌క‌థ‌లో ప్రేమికులంతా ఒక్కొక్క‌రూ ఒక్కో కొత్త పార్ట‌న‌ర్ ని క‌నుగొని వారితో పెళ్లి బంధంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఎవ‌రి దారివారిదే. ఈ మొత్తం ఎపిసోడ్ ఎవ‌రి గురించి అంటే.. ర‌ణ‌బీర్ క‌పూర్- దీపిక ప‌దుకొనే- క‌త్రిన గురించే.

రణబీర్ కపూర్ - దీపికా పదుకొణె చాలా సినిమాల్లో ప్రేమికులుగా ర‌క్తి క‌ట్టించే కెమిస్ట్రీతో మైమ‌రిపించారు. ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అభిమానులు ఎంతగానో మెచ్చుకుంటారు. వారు ఈ జంటను స్క్రీన్‌పై చూడటమే కాకుండా ఘాటైన‌ రొమాన్స్ ను కూడా ఆనందిస్తారు. వీరిద్దరి పాత వీడియో ఒక‌టి ఇప్పుడు రెడ్డిట్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది. ఇందులో రణబీర్ దీపికను ``చీప్ గ‌ర్ల్`` అని కామెంట్ చేసాడు. కొద్దిసేపటికే ఆ వీడియో వైరల్‌గా మారింది. చీప్ గ‌ర్ల్ అని త‌న‌ని పిల‌వ‌గానే దీపిక షాక్ కి గురై ఎక్స్ ప్రెష‌న్ ని అదోలా మార్చింది. కానీ ఆ త‌ర్వాత దానికి క‌వ‌ర్ చేస్తూ ఫ‌న్ జోన్‌ని ఆశ్ర‌యించడం స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది.

జూమ్ టీవీతో జరిగిన సంభాషణలో రణబీర్ మాట్లాడుతూ, ``ఆమెతో కొంటెగా మాట్లాడ‌గ‌లం. ఆమెతో చాలా చీకీగా ఉండగ‌లం.. ఆమె చాలా బాగా స్పందిస్తుంది. సులువుగా స్పందిస్తుంది`` అని వ్యాఖ్యానించాడు.

ఇంతియాజ్ కూడా `లవ్ ఆజ్ కల్` సమయంలో ఈ విషయాన్ని గ్రహించాడు. మొదట అతడు ఆమెతో మాట్లాడేవాడు. చాలా సమయం ఆమె కళ్ళు వెలిగిపోయేవి.. ఆమె తక్కువ స‌మ‌యంలోనే బాగా స్పందిస్తుంది! అంటూ చిలిపిగా కామెంట్ చేసాడు ర‌ణ‌బీర్.

అయితే దీపిక ఆ స‌మ‌యంలో అతడిని డిస్ట్ర‌బ్ చేస్తూ ఒక ప్ర‌శ్న అడిగింది. ``మీరు నాతో ఎలా చౌకగా ఉంటారు?`` అని అడిగింది. ర‌ణబీర్ స్పందిస్తూ, ``నేను కెమెరా ముందు ఉండలేను. నేను చెప్పేదేమిటి అంటే.. ఇస్మే చీప్ భారా హువా హై. చీప్‌నెస్ కి దుకాన్ హై యే`` అని వ్యాఖ్యానించాడు. పాత వీడియోనే అయినా ఇప్పుడు ఇది నెటిజనుల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది.