Begin typing your search above and press return to search.

రామాయణం కోసం 'యానిమల్‌' ఏం చేస్తున్నాడంటే...!

రాముడి బాడీ లాంగ్వేజ్ ను ప్రాక్టీస్ చేయడంతో పాటు డైలాగ్‌ డెలవరీ మరియు ఫేస్ ఎక్స్‌ ప్రెషన్స్ ఇలా అన్ని విషయాల్లో ట్రైనింగ్‌ తీసుకుంటూ ఉన్నాడట.

By:  Tupaki Desk   |   8 Feb 2024 6:13 AM GMT
రామాయణం కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే...!
X

రెండు మూడు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ రామాయణం ఈ ఏడాదిలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు నితేష్ తివారీ సుదీర్ఘ కాలంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌ తో రూపొందబోతున్న రామాయణం లో బాలీవుడ్ స్టార్‌ రణబీర్ కపూర్‌ ను రాముడిగా చూపించబోతున్నారు.

అధికారిక ప్రకటన రానప్పటికి రాముడి పాత్రలో రణబీర్ కపూర్‌ కన్ఫర్మ్‌ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా యానిమల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుని తన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న రణబీర్ కపూర్‌ గత కొన్నాళ్లుగా రాముడి పాత్రకు రెడీ అవుతున్నాడట.

రాముడి బాడీ లాంగ్వేజ్ ను ప్రాక్టీస్ చేయడంతో పాటు డైలాగ్‌ డెలవరీ మరియు ఫేస్ ఎక్స్‌ ప్రెషన్స్ ఇలా అన్ని విషయాల్లో ట్రైనింగ్‌ తీసుకుంటూ ఉన్నాడట. పాత రామాయణ కథాంశ సినిమాలు మరియు సీరియల్ ను చూడటం ద్వారా రణబీర్ కపూర్ రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.

భాష తో పాటు ప్రతి విషయంలో కూడా రణబీర్‌ కపూర్‌ సిద్ధం అవుతున్నాడు. రామాయణం పూర్తి అయినంత కాలం రణబీర్ కపూర్ మరే సినిమాకు కమిట్‌ అవ్వకూడదని కూడా భావిస్తున్నాడట. మొత్తానికి ఈ ఏడాదిలో రామాయణం పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు లేదా మూడు పార్ట్ లను 2030 వరకు విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల టాక్‌.

ఇక రామాయణం లో సీత పాత్రకు గాను సాయి పల్లవి ని సంప్రదించారని తెలుస్తోంది. కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ ను రావణుడి పాత్రకు గాను సంప్రదించారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. మొత్తానికి రామాయణం పాన్‌ ఇండియా రేంజ్ దాటి అంతకు మించి అన్నట్లుగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.