Begin typing your search above and press return to search.

షాకిస్తున్న స్టార్ హీరో నిక‌ర ఆస్తుల విలువ‌

2023 సంవ‌త్స‌రం ర‌ణ‌బీర్ క‌పూర్ కి అన్ని విధాలా క‌లిసొచ్చింది. అత‌డు ఆలియాను పెళ్లాడి ఒక బిడ్డ‌కు తండ్రి అయ్యాక స్టార్ డ‌మ్ వెలుగుతోంద‌ని చెప్పాలి

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:36 AM GMT
షాకిస్తున్న స్టార్ హీరో నిక‌ర ఆస్తుల విలువ‌
X

2023 సంవ‌త్స‌రం ర‌ణ‌బీర్ క‌పూర్ కి అన్ని విధాలా క‌లిసొచ్చింది. అత‌డు ఆలియాను పెళ్లాడి ఒక బిడ్డ‌కు తండ్రి అయ్యాక స్టార్ డ‌మ్ వెలుగుతోంద‌ని చెప్పాలి. తూ జీతూ మ‌ర‌క్క‌ర్- బ్ర‌హ్మాస్త్ర‌- యానిమ‌ల్ లాంటి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలు అందుకున్నాడు. ఇప్పుడు యానిమ‌ల్ అత‌డి కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలిచింది. తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన యానిమ‌ల్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. కంటెంట్ లో హింసాత్మ‌క ధోర‌ణిపై చాలా విమ‌ర్శ‌లు ఎదురైనా కానీ సినిమాలో ర‌ణ‌బీర్ క‌పూర్ న‌ట‌న అద్భుతంగా ఉంద‌న్న ప్ర‌శంస‌లు కురిసాయి.

ఇక ఇదే సంద‌ర్భంలో ర‌ణబీర్ క‌పూర్ నిక‌ర ఆస్తుల గురించి అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ర‌ణ‌బీర్ ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్కో సినిమాకు 50కోట్ల వ‌ర‌కూ అందుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' కోసం 70 కోట్ల రూపాయలను అందుకున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. అంతేకాదు.. అత‌డు రూ. 345 కోట్ల రూపాయల నికర ఆస్తుల‌ను క‌లిగి ఉన్నాడ‌ని స‌మాచారం.

ర‌ణబీర్ సినిమాలు, వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ భారీగా పారితోషికాలు అందుకుంటున్నాడు. వెట‌ర‌న్ స్టార్ రిషీ క‌పూర్- నీతూ జంట‌ వార‌సుడిగా అత‌డికి ఆస్తులు భారీగా ఉన్నాయి. ఇటీవ‌ల రిషీజీకి చెందిన కొన్ని ఆస్తుల అమ్మ‌కం ద్వారా ర‌ణ‌బీర్ వాటాలు అందుకున్నాడు. నిర్మాణాల్లో ఉన్న భారీ భ‌వంతుల్లోను అత‌డికి వాటాలు ఉన్నాయి. 2014 నుండి మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ సావ్న్‌కు వాటాదారుగా ఉన్న అత‌డు బ్రాండ్ అంబాసిడర్‌గాను ఉన్నారు. ఇండియన్ సూపర్ లీగ్ జట్టు, ముంబై సిటీ FCలో రణబీర్ 35 శాతం వాటాను కలిగి ఉన్నాడు. అలాగే పర్యావరణ అనుకూల ఉత్పత్తి కంపెనీ బెకోలో కూడా ఆర్కే పెట్టుబడి పెట్టాడు.

రియల్ ఎస్టేట్ లోను ర‌ణ‌బీర్ భారీ పెట్టుబ‌డులు పెట్టాడు. రణబీర్ కపూర్ బాంద్రాలో 4 BHK అపార్ట్‌మెంట్‌.. పూణేలోని ట్రంప్ టవర్స్‌లో 13 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన అపార్ట్మెంట్లలో పెట్టుబడి పెట్టాడు. ఈ ఆస్తి అతనికి వార్షిక అద్దె రూ. 48 లక్షలు వ‌ర‌కూ వ‌స్తోంది.

బ్రాండ్ల‌తో భారీ ఆదాయం:

ర‌ణ‌బీర్ ఒక్కో సినిమాకి 70 కోట్లు అందుకుంటున్నాడు. యానిమ‌ల్ కి 70 కోట్లు అందుకోగా, ఈ సినిమా పాన్ ఇండియా విజ‌యం సాధించ‌డంతో ఇక‌పై 100 కోట్లు డిమాండ్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. మ‌రోవైపు ప్రతి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం సుమారు రూ. 6 కోట్లు వ‌సూలు చేస్తాడ‌ని స‌మాచారం. పాపుల‌ర్ బ్రాండ్లు లేస్, తస్వా, ఏషియన్ పెయింట్స్, లియోనో, మైంత్రా, పానాసోనిక్‌ల కు ర‌ణ‌బీర్ ప్ర‌చారం చేస్తున్నారు. వీటి ద్వారా ఏడాదిలో 100 కోట్లు పైగానే ఆర్జిస్తున్నాడ‌ని స‌మాచారం.