Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ @4... ఒకదాన్ని మించి మరోటి

చాక్లెట్‌ బాయ్ ఇమేజ్ నుంచి వైల్డ్‌ యానిమల్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రణబీర్‌ కపూర్‌ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 5:30 PM GMT
సూపర్ స్టార్‌ @4... ఒకదాన్ని మించి మరోటి
X

బాలీవుడ్ యంగ్ హీరోల్లో రణబీర్‌ కపూర్‌ నెం.1 అంటూ పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది. చాక్లెట్‌ బాయ్ ఇమేజ్ నుంచి వైల్డ్‌ యానిమల్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రణబీర్‌ కపూర్‌ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు రాబోయే రెండేళ్ల కాలంలో వరుసగా రాబోతున్నాయి.


సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్‌ కాన్సెప్ట్‌ తో భారీ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన భార్య ఆలియా భట్ హీరోయిన్‌ గా నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ సినిమా అంటే కచ్చితంగా భారీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

యానిమల్‌ తో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన సందీప్ వంగ త్వరలో సీక్వెల్‌ గా యానిమల్‌ పార్క్ ను చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో రణబీర్ కపూర్ మరింత వైల్డ్ గా, నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. యానిమల్‌ పార్క్ సినిమాను స్పిరిట్‌ తర్వాత మొదలు పెట్టే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడు.

బ్రహ్మాస్త్ర మూవీ మొదటి పార్ట్‌ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చే ఏడాది రెండో పార్ట్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలో బ్రహ్మాస్త్ర 2 సినిమా షూటింగ్‌ షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు పాన్ వరల్డ్‌ ఇండియన్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్‌ రామాయణం. నితీష్ తివారి దర్శకత్వంలో దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌ తో రూపొందబోతున్న రామయణం సినిమా కోసం దాదాపుగా రెండేళ్ల సమయంను రణబీర్ కపూర్‌ ఇవ్వబోతున్నాడు.

మొత్తానికి యానిమల్‌ సినిమా హిట్ తో రణబీర్ కపూర్‌ ఫుల్‌ బిజీ అవ్వబోతున్నాడు. ఆయన నుంచి రాబోతున్న ప్రతి సినిమాను కూడా వెయ్యి కోట్ల మూవీగా ఆయన ఫ్యాన్స్ మరియు ఫిల్మ్‌ మేకర్స్‌ ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. కంటెంట్ బాగుంటే కచ్చితంగా రణబీర్ కపూర్ ముందు ముందు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం కన్ఫర్మ్‌.