Begin typing your search above and press return to search.

రణబీర్ కటౌట్ పాతుకుపోయేలా ఉంది

ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఊహించని మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   1 Dec 2023 2:18 PM GMT
రణబీర్ కటౌట్ పాతుకుపోయేలా ఉంది
X

ఇటీవల కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఊహించని మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కంటెంట్ తో మెప్పించకపోతే మాత్రం ఆడియన్స్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ఒకప్పుడు ఆ ఇండస్ట్రీలో ఖాన్ త్రయం ఏ రేంజ్ లో డామినేట్ చేసేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే షారుక్ ఖాన్ వరుస హిట్స్ కొడుతున్నాడు కానీ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో అయితే పర్ఫెక్ట్ సక్సెస్ కొట్టడం లేదు.


ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ పై పట్టు సాధించడానికి ఇండియాలో తమిళ హీరోలకు మాత్రమే సాధ్యమవుతుంది. లోకల్ హీరోలకు దీటుగా కోలీవుడ్ హీరోలు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలాసార్లు చాలామంది హీరోలు మన దగ్గర మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా సాధ్యపడలేదు.

90 ల కాలంలో అయితే సల్మాన్ ఖాన్ ప్రేమాలయం, ప్రేమ పావురాలు అంటూ కొన్ని ఫ్యామిలీ లవ్ స్టోరీలతో మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాతోనూ అతను తెలుగులో పెద్దగా హడావిడి అయితే చేయలేదు. ఇక ఆమధ్య ఆమిర్ ఖాన్ మాత్రం దంగల్ సినిమాతో తెలుగు లాంగ్వేజ్ లో కాస్త హిట్ కొట్టినప్పటికీ తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు.

కానీ ఇప్పుడు మాత్రం రణబీర్ కపూర్ యానిమాల్ సౌండ్ వింటూ ఉంటే అతను తెలుగు ఇండస్ట్రీలో కూడా తన కటౌట్ ను బలంగా పాతుకుపోయేలా చేస్తాడేమో అనిపిస్తోంది. లోకల్ హీరోలకు కొన్ని ఐకాన్ టాలీవుడ్ థియేటర్లలో ఏ స్థాయిలో కటౌట్స్ పడుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సుదర్శన్ థియేటర్లో కూడా మన మాస్ హీరోలకు ప్రతి సినిమాకు కూడా పవర్ఫుల్ కటౌట్స్ పడుతూ ఉంటాయి.

అయితే ఇప్పుడు యానిమల్స్ సినిమాకు కూడా అలాంటి కటౌట్ కనిపించింది. అక్కడ రక్తంతో తడిసిన బట్టలతో ఉన్న రణబీర్ కటౌట్ చూస్తూ ఉంటే మన మాస్ హీరోలకు దీటుగానే ఇక్కడ తను తన ఉనికిని చాటుకునే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒక విధంగా టాలీవుడ్ సినిమా చరిత్రలో బెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటున్న బాలీవుడ్ హీరోగా రణబీర్ కపూర్ ఒక రికార్డును క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పవచ్చు. మొత్తానికి వైల్డ్ గా అయితే రెండు బీర్ కపూర్ టాలీవుడ్ జనాలకు ఒక మత్తు లాగా ఎక్కేస్తున్నాడు. మరి ఇదే తరహాలో అతని తదుపరి సినిమాలు కూడా ఉంటాయో లేవో చూడాలి.