Begin typing your search above and press return to search.

రణబీర్ కపూర్ మైండ్ బ్లోయింగ్ లైనప్.. అన్నీ పెద్ద కథలే..

బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ గత ఏడాది యానిమల్ చిత్రంతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు

By:  Tupaki Desk   |   25 Jan 2024 4:22 AM GMT
రణబీర్ కపూర్ మైండ్ బ్లోయింగ్ లైనప్.. అన్నీ పెద్ద కథలే..
X

బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ గత ఏడాది యానిమల్ చిత్రంతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ బిటౌన్ లో సెన్సేషన్ కావడమే కాకుండా పెద్ద చర్చకి కూడా దారితీసింది. సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ వెళ్లి ఇలాంటి కల్ట్ కాన్సెప్ట్ తో రణబీర్ కపూర్ లాంటి హీరోతో మూవీ చేయడం నిజంగా ప్రతి తెలుగోడు గర్వపడాల్సిన విషయం.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో స్టార్ హీరోలైన ఖాన్ త్రయాన్ని మించిపోయే విధంగా ఇప్పుడు రణబీర్ కపూర్ ఇమేజ్ ఉంది. ఆయన నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్ని కూడా వందల కోట్ల బడ్జెట్ తో, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. తక్కువ సమయంలో బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని రణబీర్ కపూర్ సొంతం చేసుకున్నారు.

యానిమల్ క్రియేట్ చేసిన వేవ్ తో తెలుగులో కూడా రణబీర్ కపూర్ సినిమాలని ఇకపై ఆడియన్స్ ఆదరించే అవకాశం ఉంది. నెక్స్ట్ అతను చేయబోయే సినిమాల జాబితా చూసుకుంటే మొదటిగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ భార్య స్టార్ హీరోయిన్ అలియా భట్ ఫీమేల్ లీడ్ చేస్తోంది.

ఈ ఏడాదిలోనే యానిమల్ మూవీ సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అలాగే నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న రామాయణం మూవీ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీ రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటించనున్నారని టాక్ వస్తోంది.

వీటి తర్వాత అయాన్ ముఖర్జీ దర్శాకత్వంలో బ్రహ్మాస్త్ర 2, బ్రహ్మాస్త్ర 3 మూవీస్ కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాలు 2026 ఆఖరులో లేదంటే 2027లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రణబీర్ కపూర్ చేస్తోన్న ప్రాజెక్ట్స్, డైరెక్టర్స్ బట్టి చూసుకుంటే కచ్చితంగా మొదటి మూడు సినిమాలకి రెండేళ్ల సమయం పెట్టొచ్చని బిటౌన్ లో వినిపిస్తోన్న మాట. అంటే బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ బిజియస్ట్ హీరోగా రణబీర్ కపూర్ ఉన్నాడని అర్ధమవుతోంది.