Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమాలో రణబీర్.. ఇదిగో క్లారిటీ

ఇక నిజ జీవితంలో మాత్రం అతను చాలా కూల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. అంతే కాకుండా తన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే విధంగా మాట్లాడుతూ ఉంటాడు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 11:05 AM GMT
ప్రభాస్ సినిమాలో రణబీర్.. ఇదిగో క్లారిటీ
X

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ అందుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అతను వెండితెరపై హీరోగా ల్ ఎలాంటి పాత్రలో అయినా న్యాయం చేస్తాడు అని చాలాసార్లు రుజువు చేశాడు. ఇక నిజ జీవితంలో మాత్రం అతను చాలా కూల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తాడు. అంతే కాకుండా తన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే విధంగా మాట్లాడుతూ ఉంటాడు.

ఇక తెలుగువారిని ఆకట్టుకోవడానికి అతను చాలా బాగా కృషి చేస్తున్నారు అని చెప్పవచ్చు. యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో అతను తెలుగు ఆడియన్స్ పై చూపిస్తున్న ప్రేమ అంత కాదు. గతంలోనే బ్రహ్మాస్త్ర సినిమా కోసం లోకల్ హీరోల కంటే ఎక్కువగా ప్రమోషన్ చేశాడు. అంతే కాకుండా రాజమౌళి సహాయం తీసుకున్నాడు. అప్పుడే ప్రభాస్ గురించి చాలా పాజిటివ్గా స్పందించిన విధానం ఎంతగానో హైలెట్ అయ్యింది.

రీసెంట్గా మరోసారి ప్రభాస్ పై ఉన్న ప్రేమను అన్ స్థాపబుల్ షోలో చాటుకున్నాడు. ఈ షోలో హీరోయిన్ రష్మిక సందీప్ రెడ్డి కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ విధానం గురించి చాలా గొప్పగా మాట్లాడిన రణబీర్ కపూర్ అతనితో ఇంకా వర్క్ చేయాలని ఉంది అని కూడా తెలియజేశాడు. అంతేకాకుండా సందీప్ రెడ్డి తర్వాత చేయబోయే స్పిరిట్ సినిమా గురించి కూడా అతను రియాక్ట్ అయ్యాడు.

ఆ సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని ఒక్క మాటలోనే తెలియచేసాడు. ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో ఒక చిన్న పాత్రలో అవకాశం ఇచ్చినా కూడా నేను నటించడానికి రెడీ అని రణబీర్ వివరణ ఇచ్చాడు. దీన్ని బట్టి సందీప్ రెడ్డి పై అలాగే ప్రభాస్ పై ఎంత పాజిటివ్ గా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ నిజంగానే రణబీర్ ప్రభాస్ స్పిరిట్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే వాతావరణం మాములుగా ఉండదని చెప్పవచ్చు.

ఏదేమైనా చాలామంది ఇలా మాట్లాడేందుకు కాస్త స్టార్ స్టేటస్ తో ఆలోచిస్తారు. కానీ రణబీర్ గ్రౌండెడ్ లెవెల్ లో ఉంటూ తెలుగు వారిని ఆకట్టుకుంటు ఉన్నాడు. మరి యానిమాల్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద క్లిక్ అవుతుందో లేదో చూడాలి. ఇక యానిమాల్ డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది.