Begin typing your search above and press return to search.

కొత్త సంవ‌త్స‌రంలో ఆలియాకు తొలి ముద్దు?

కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల కోసం సెల‌బ్రిటీలంతా ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   2 Jan 2024 3:36 AM GMT
కొత్త సంవ‌త్స‌రంలో ఆలియాకు తొలి ముద్దు?
X

కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల కోసం సెల‌బ్రిటీలంతా ఎగ్జోటిక్ లొకేష‌న్ల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. చాలామంది విదేశీ వెకేష‌న్ల‌కు వెళ్లారు. ఈసారి ఆలియా బీచ్ వెకేష‌న్ కి వెళ్లింది. అయితే భ‌ర్త ర‌ణ‌బీర్ క‌పూర్ తో పాటు కుమార్తె రాహా క‌పూర్ కూడా త‌న వెంటే వ‌చ్చారు. ఆలుమ‌గ‌ల మ‌ధ్య బేబి రాహా రాక ఇప్పుడు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా మారింది. ముఖ్యంగా ఆలియా - ర‌ణ‌బీర్ దంప‌తుల ఆనందానికి రాహా ఒక యూనిక్ కార‌ణంగా మారింది. కానీ ఇది ఎంతో సంతోష‌క‌ర స‌మ‌యం.. ప్ర‌త్యేక‌మైన‌ది! అని ఆలియా భావిస్తోంది.


ఈ ఆనంద స‌మ‌యాన్ని భ‌ర్త కుమార్తెతో క‌లిసి ఆస్వాధిస్తోంది. కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల్లో ఆలియా ఆనందానికి అవ‌ధుల్లేవ‌న‌డానికి ఇదిగో ఈ తొలి ముద్దు నిద‌ర్శ‌నం. ఇటీవ‌ల‌ క్రిస్మస్ సందర్భంగా రాహాను బహిరంగంగా పరిచయం చేసిన తర్వాత ఆ ముగ్గురూ ముంబైలోని ప్రైవేట్ విమానాశ్రయంలో కనిపించారు, ఒక ఫోటోగ్రాఫ‌ర్ షేర్ చేసిన వీడియోలో ఆలియా-ర‌ణ‌బీర్ - బేబి రాహా క‌నిపించారు.


అలియా కొత్త సంవ‌త్స‌రం వేళ‌ త‌న కుటుంబంతో మాల్దీవుల వెకేష‌న్ ను ఆస్వాధిస్తోంది. తమ బీచ్ వెకేషన్ నుండి అరుదైన‌ ఫోటోలను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. మొదటి ఫోటోలో రణబీర్ - అలియా స్పోర్ట్స్ పార్టీ టోపీలు ధ‌రించారు. రణబీర్ ఆమె బుగ్గలపై ఉద్వేగభరితంగా ముద్దులు పెడుతూ రొమాంటిక్ వైబ్స్ ని తెచ్చాడు. రెండవ ఫోటోలో అలియా కెమెరాను చూస్తూ నవ్వుతూ ఉంది. మరో ఫోటోలో 2023 చివరి సూర్యాస్తమయాన్ని తన ఒడిలో ఉన్న‌ చిన్ని రాహాతో క‌లిసి చూస్తున్నట్లు క‌నిపిస్తోంది. అలియా అల్లకల్లోలమైన బీచ్ అలలను చూపిస్తూ సెల్ఫీని కూడా షేర్ చేసింది. ఒక ఫోటోలో అలియా తన పాదాలను గాలిలో ఉంచి క‌నిపించింది. చివరి ఫోటోలో పార్టీ హార్న్ బ్లోవర్‌ని ఊదుతూ క‌నిపించింది.


'రణబీర్ -అలియా- రాహా'కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. నవంబర్ 2022లో తమ కుమార్తె రాహాను స్వాగతించిన ఆలియా.. కపూర్ ఫ్యామిలీ క్రిస్మస్ లంచ్‌లో కుమార్తెను మీడియాకు పరిచయం చేశారు. నీలి కళ్లతో కపూర్ ల గారాల ప‌ట్టి ఎంతో క్యూట్ గా క‌నిపించింది. రాహా క్రిస్మస్ దుస్తులను ధరించింది. ఫోటోగ్రాఫ‌ర్లు షేర్ చేసిన‌ వీడియోలలో రాహా పింక్ అండ్ వైట్ డ్రెస్‌.. రుడాల్ఫ్ ది రెడ్ నోస్డ్ రైన్‌డీర్ దుస్తులతో కనిపించింది. రాహా ఎరుపు రంగు బూట్లు ధరించింది. బేబి ఫోటోలు ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అయ్యాయి. నిజానికి ఈ దంప‌తులు రాహాను లైమ్‌లైట్ నుండి దూరంగా ఉంచాలని భావించినా అది వీలుప‌డ‌లేదు.