Begin typing your search above and press return to search.

'రామాయణ'లో రణబీర్‌, సాయి పల్లవి, యశ్‌ ఎందుకు..!

బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్‌ హీరోలు ఉండగా, సౌత్‌ ఇండియాలో ఎంతో మంది స్టార్‌డం ఉన్న హీరోలు ఉండగా 'రామాయణ' సినిమాలో రణబీర్ కపూర్‌ను దర్శకుడు నితేష్ తివారీ ఎందుకు రాముడిగా ఎంపిక చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   18 July 2025 8:00 PM IST
రామాయణలో రణబీర్‌, సాయి పల్లవి, యశ్‌ ఎందుకు..!
X

బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్‌ హీరోలు ఉండగా, సౌత్‌ ఇండియాలో ఎంతో మంది స్టార్‌డం ఉన్న హీరోలు ఉండగా 'రామాయణ' సినిమాలో రణబీర్ కపూర్‌ను దర్శకుడు నితేష్ తివారీ ఎందుకు రాముడిగా ఎంపిక చేసుకున్నాడు. గతంలో చేసి అనుభవం ఉన్న హీరోలు చాలా మంది ఉన్నప్పటికీ రణబీర్‌ కపూర్‌లో ఎలా నితేష్ తివారీ రాముడిని చూశాడు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా బాలీవుడ్‌లో ఎంతో మంది అందగత్తెలు, నటనలో అద్భుతమైన ప్రతిభ ఉన్న హీరోయిన్స్‌ బాలీవుడ్‌లో ఎంతో మంది ఉన్నారు. సౌత్‌లోనూ అందం విషయంలో అందరూ కుళ్లుకునే విధంగా ఆకట్టుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అయినా కూడా సాయి పల్లవిని సీత పాత్రకు ఎంపిక చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఒక హీరో అయిన యశ్‌ను ఎలా ఈ సినిమాలో రావణుడి పాత్రకు ఎంపిక చేశారు అనేది కొందరి అనుమానం.

ఇలా ఈ సినిమా స్టార్‌ కాస్టింగ్‌ గురించి రకరకాలుగా ప్రశ్నలు ఉన్నాయి. నితేష్ తివారీ ఏ ప్రాతిపదికన సినిమాలో నటీనటులను ఎంపిక చేసి ఉంటాడు అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. రాముడి పాత్రను ఇప్పటి వరకు చేయని నటుడి కోసం నితేష్ తివారీ చూశాడట. రాముడు అంటే ఆకర్షణీయమైన రూపం కలిగి ఉండాలి. ఆ రూపం రణబీర్ కపూర్‌లో ఉంది, అంతే కాకుండా హుందాగా, సింపుల్‌గా రాముడు ఉంటాడు. కనుక ఆ గుణాలు రణబీర్‌ కపూర్‌లో ఉంటాయని దర్శకుడు భావించినట్లు ఉన్నాడు. అంతే కాకుండా సినిమాలో స్టార్‌ కాస్ట్‌ గురించి ఆలోచించకుండా రాముడు ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు బాలీవుడ్‌ హీరోల్లో ఎక్కువ మంది రణబీర్‌ కపూర్‌ సూచించినట్లు తెలుస్తోంది.

సీత పాత్ర విషయంలో చాలా చర్చలు జరిగినట్లు సమాచారం అందుతోంది. సీత అందంగా ఉండాలి, అలా అని మేకప్స్‌ తో సర్జరీతో అందం తెచ్చుకోవద్దని అనుకున్నారు. అందుకే సీత పాత్ర కోసం స్టార్స్‌ను ఎంపిక చేసే క్రమంలో కొంత మంది హీరోయిన్స్‌ పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ సాయి పల్లవి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారట. సింప్లిసిటీ తో సాయి పల్లవి ఎప్పుడూ అందంగా కనిపిస్తూ ఉంటుంది. సీత మోములో నవ్వు చెరగదు అంటారు. అందుకే సాయి పల్లవి వంటి నేచురల్ బ్యూటీ ని ఈ సినిమాలోని సీత పాత్ర కోసం ఎంపిక చేశారు. ఇక కేజీఎఫ్‌లో అత్యంత రౌద్రంగా కనిపించిన యశ్‌ను దర్శకుడు నితేష్ ఎంపిక చేసుకుని మరీ రావణుడి పాత్రను ఆఫర్‌ చేశాడట.

ఈ మూడు పాత్రలు మాత్రమే కాకుండా ప్రతి పాత్ర విషయంలోనూ ఇదే తరహాలో ఆలోచించి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చిన్న పాత్రకు సైతం దానికి తగ్గ నటుడిని ఎంపిక చేయడంతో స్టార్‌ కాస్టింగ్‌ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా రెండు మూడు పార్ట్‌లుగా రాబోతుంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థల కథనాల అనుసారం ఈ సినిమా మేకింగ్‌కు రూ.4000 కోట్లు ఖర్చు అవుతుంది. మొదటి పార్ట్‌ను 2026 దీపావళికి తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్‌ చకచక జరుగుతోంది. రామాయణం ను ఇప్పటికే చాలా సార్లు బుల్లి తెరపై, వెండి తెరపై చూసిన ప్రేక్షకులు ఈ సినిమా ను ఆదరిస్తారా అనే అనుమానం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ రామాయణం కథ ఎన్ని సార్లు వచ్చినా ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుంది కనుక ప్రతి సారి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ సినిమా సైతం తప్పకుండా వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద హాలీవుడ్ రేంజ్ వసూళ్లు నమోదు చేయడం ఖాయం.