Begin typing your search above and press return to search.

బీటౌన్ 'రామాయణ'.. అశోక వనం చూశారా?

బాలీవుడ్ లో రామాయణ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 April 2025 10:00 PM IST
బీటౌన్ రామాయణ.. అశోక వనం చూశారా?
X

బాలీవుడ్ లో రామాయణ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పలువురు బీటౌన్ టాప్ ప్రొడ్యూసర్లతో కలిసి తెలుగు నిర్మాత అల్లు అరవింద్ రూపొందిస్తున్నారు. రెండు పార్టులుగా సినిమా రానుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు.

కొద్ది రోజుల క్రితం రెండు పోస్టర్స్ రిలీజ్ చేసి ఆ విషయాన్ని తెలిపారు. 2026 దీపావళి కానుకగా ఫస్ట్ పార్ట్.. 2027 దీపావళి స్పెషల్ గా రెండో భాగాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ బీర్‌ కపూర్‌ రాముడిగా.. సీతమ్మగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి యాక్ట్ చేస్తున్నారు. రావణుడిగా యశ్‌ కనిపించనున్నారు.

హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఫస్ట్ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఆ మధ్య రణ్ బీర్ కపూర్.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మొదటి భాగానికి సంబంధించిన తన పార్ట్ ను పూర్తి చేసినట్లు వెల్లడించారు.

త్వరలోనే పార్ట్‌ 2 చిత్రీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు. కానీ మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు రామాయణ రెండో భాగం షూటింగ్ కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మే నెల చివర్లో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అందుకు గాను మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

తొలుత.. సీత పాత్రకు సంబంధించి అశోక వనం ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఆ సీన్స్ తీయనున్న సెట్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో మధ్యలో సెట్ ఉండగా, చుట్టూ బ్లూ కలర్ కర్టైన్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి.

నిజానికి.. బ్యాగ్రౌండ్ ఎఫెక్ట్స్, వీఎఫ్ ఎక్స్ కోసం ఆ కర్టెన్స్ వాడుతారన్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆ వీడియో చక్కర్లు కొడుతుండడంతో.. సెట్ బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికే రామాయణంపై ఎన్నో సినిమాలు రాగా.. ఈ మూవీ మాత్రం నెవ్వర్ బిఫోర్ లా ఉంటుందని అంచనాలు మాత్రం ఆడియన్స్ లో ఉన్నాయి. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.