రామాయణం కోసం నలిగిపోయిన డైరెక్టర్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక కావ్యాన్ని వెండితెరపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించడం అంటే అదొక సినిమా రూపకల్పన మాత్రమే కాదు.
By: Srikanth Kontham | 23 May 2026 2:00 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో పౌరాణిక కావ్యాన్ని వెండితెరపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించడం అంటే అదొక సినిమా రూపకల్పన మాత్రమే కాదు. ఒక మహా యజ్ఞం లాంటిది. దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా రూపొందుతున్న `రామాయణం` చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే ఈ కళాకండాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వెనుక దర్శకుడు పడుతున్న శ్రమ, ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి అంతా ఇంతా కాదు. బాహ్య ప్రపంచానికి కనిపించే గ్లామర్ వెనుక ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎన్నో సవాళ్లతో సతమతమవుతున్నారనేది పచ్చి నిజం.
రామాయణం వంటి పవిత్రమైన ఇతిహాసాన్ని తెరకెక్కించడం సాధారణ దర్శకుడికి సాధ్యం కాని పని. ఎందుకంటే ఇది కోట్ల మంది ప్రజల సెంటిమెంట్లు, నమ్మకాలు , భక్తిభావంతో ముడిపడి ఉన్న సబ్జెక్ట్. ప్రతి పాత్ర రూపకల్పన, ప్రతి డైలాగ్, ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా, ఎక్కడా మూలాలు దెబ్బతినకుండా మలచాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా? ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. నైతిక బాధ్యత, సామాజిక ఒత్తిడి ఎదు ర్కుంటూ నితీష్ తివారీ ప్రతి రోజూ కత్తిమీద సాములా పని చేస్తున్నారు. కథా పరమైన జాగ్రత్తలే కాకుండా చెప్పుకోలేని ఎన్నో సాంకేతిక, నిర్మాణ రంగ సమస్యలు సినిమాను చుట్టు ముట్టాయి.
భారీ బడ్జెట్ కావడం, రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, సన్నీ డియోల్ వంటి అగ్ర నటీనటుల డేట్స్ సర్దుబాటు చేయడం, అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ పనులను సమన్వయం చేసుకోవడం వంటివి నితీష్ తివారీకి పెద్ద సవాలుగా మారాయి. వీటికి తోడు మారుతున్న సినిమా క్యాలెండర్లు, అనుకోని ఆలస్యాలు ఒక దర్శకుడిగా ఆయన సహనాన్ని నిరంతరం పరీక్షిస్తూనే ఉన్నాయి. ఈ అదృశ్య సమస్యల వల్లే ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం పూర్తిగా నలిగిపోవాల్సి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇంతటి అపారమైన సవాళ్లు , మానసిక ఆందోళనలు ఉన్నా? నితీష్ తివారీ సృజనాత్మక స్పష్టతను ఎక్కడా కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు.
ఇలాంటి మహా కావ్యాన్ని తెరకెక్కించడం అంత సులభం కాదని స్వయంగా అంగీకరించారు. అయితే సరైన సంకల్పంతో? పవిత్రమైన ఉద్దేశంతో పని చేసినప్పుడే ఇలాంటి చిత్రాలకు న్యాయం జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. ఈ నిబద్ధతే ఆయన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా? నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చినా? సినిమాను అనుకున్న రీతిలో పూర్తి చేయడానికి ముందుకు నడిపిస్తోంది.
దాదాపు మూడేళ్లగా సాగుతున్న సుదీర్ఘ ప్రయాణంలో నిర్మాత నమిత్ మల్హాత్రా , హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ సంస్థలు దర్శకుడికి కొండంత అండగా నిలిచాయి. వెండితెరపై సృష్టించబోయే విజువల్స్ పట్ల ఉన్న నమ్మకం, సాంకేతిక బృందం అందిస్తున్న సహకారం వల్లనే నితీష్ తివారీ క్లిష్టమైన అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమించ గలుగుతున్నారు. ఎన్ని అంతర్గత సమస్యలు ఉన్నా? వాటన్నింటినీ తనలోనే దాచుకుంటూ సెట్స్‌పై మాత్రం ఎంతో ప్రశాంతంగా, ఓపికగా ఉత్తమమైన అవుట్‌పుట్‌ను రాబట్టుకుంటున్నారు. రెండు భాగాలగా తెరకెక్కుతోన్న చిత్రం మొదటి భాగం 2026 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
