Begin typing your search above and press return to search.

స్టార్ హీరో తెలివైన బిజినెస్ ప్లాన్స్ సూప‌ర్ స‌క్సెస్

సినిమాల‌తో ఆర్జిస్తూనే వ్య‌వ‌స్థాప‌కులుగా రాణిస్తున్న హీరోలు ఎంద‌రో ఉన్నారు. అలాంటి ప్ర‌ముఖుల్లో రణబీర్ క‌పూర్ ఒక‌డు.

By:  Tupaki Desk   |   17 July 2025 10:30 AM IST
స్టార్ హీరో తెలివైన బిజినెస్ ప్లాన్స్ సూప‌ర్ స‌క్సెస్
X

సినిమాల‌తో ఆర్జిస్తూనే వ్య‌వ‌స్థాప‌కులుగా రాణిస్తున్న హీరోలు ఎంద‌రో ఉన్నారు. అలాంటి ప్ర‌ముఖుల్లో రణబీర్ క‌పూర్ ఒక‌డు. అత‌డు `రామాయ‌ణం` చిత్రం కోసం ఏకంగా 150 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్నాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. రెండు భాగాలుగా రామాయ‌ణం తెర‌కెక్కుతుండ‌గా, ఒక్కో భాగానికి 75 కోట్లు అందుకుంటున్నాడ‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

ర‌ణ‌బీర్ లో వ్య‌వ‌స్థాప‌కుడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అత‌డు తెలివైన పెట్టుబ‌డిదారుడు. ఏ రంగంలో పెట్టుబ‌డి పెడితే స్థిరంగా లాభాలు ఆర్జించ‌గ‌ల‌డో వాటిపై ఫోక‌స్ చేస్తాడ‌ని అత‌డి పెట్టుబ‌డుల‌ పోర్ట్ ఫోలియో చెబుతోంది. దాదాపు రూ.345 కోట్ల నికర ఆస్తుల‌ను క‌లిగి ఉన్న ర‌ణ‌బీర్ కపూర్ ఒక్కో చిత్రానికి దాదాపు రూ.50 కోట్లు అందుకుంటాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుండి భారీగా ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఏడాదికి ఒక్కో బ్రాండ్ తో రూ.6 కోట్లకు ప్ర‌చార‌ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. ఓరియో, లేస్, కుర్‌కురే, లెనోవా, కోకా-కోలా, ఆసియన్ పెయింట్స్, పానాసోనిక్, రెనాల్ట్ వంటి ఉత్ప‌త్తుల‌కు వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించాడు. ఆదిత్య బిర్లా - డిజైనర్ తరుణ్ తహిలియాని క‌ల‌యిక‌లో ఫ్యాష‌న్ బ్రాండ్ త‌స్వాకు అత‌డు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగుతున్నాడు.

పైగా వారంద‌రితోను అత‌డు స‌హ‌భాగస్వామిగా ఉన్నాడు. ఎఫ్ఎంసిజి, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లో అత‌డి పెట్టుబ‌డులు విస్త‌రించి ఉన్నాయి. క‌పూర్ ప్రీమియం మాస్ మార్కెట్ల‌లో వేగంగా అమ్ముడ‌య్యే ఉత్ప‌త్తుల‌ను అందించే కంపెనీల‌ య‌జ‌మాని. రిల‌య‌న్స్ జియో ఆడియో స్ట్రీమ‌ర్ - సావ్న్ , డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ (డ్రోన్ సాంకేతిక‌త‌లో లిస్టెడ్ ప్లేయర్), రిటైల్ వస్తువుల స్టార్టప్ అయిన బెకో వంటి అనేక వినూత్న వెంచర్లలోను ర‌ణ‌బీర్ పెట్టుబడి పెట్టాడు. టెక్ స‌హా హార్డ్ వేర్ రంగాల్లో అత‌డి పెట్టుబ‌డులు విస్త‌రించి ఉన్నాయి. క్రీడా వ్యాపారంలోను అత‌డు ఎదుగుతున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగమైన ముంబై సిటీ ఫుట్ బాల్ క్ల‌బ్(ఎఫ్‌.సి) - అర్కా డైమో స్పోర్ట్స్‌లో వాటాలను ర‌ణబీర్ సొంతం చేసుకున్నాడు. ఇవ‌న్నీ దీర్ఘ కాలికంగా అత‌డికి భారీ ఆదాయాల్ని అందించ‌నున్నాయి. ర‌ణ‌బీర్ సోలో నిక‌ర ఆస్తులు మ‌రో ఐదేళ్ల‌లో 500 కోట్లను మించే అవ‌కాశం ఉందని అంచ‌నా.