దీపిక, కత్రిన కంటే ముందు రణబీర్ ఈ నటితో ప్రేమలో?
రణబీర్ కపూర్ మూడేళ్ల క్రితం ఆలియా భట్ ని పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాడు.
By: Tupaki Desk | 3 Jun 2025 8:45 AM ISTరణబీర్ కపూర్ మూడేళ్ల క్రితం ఆలియా భట్ ని పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాడు. అతడి కుమార్తె రాహా కపూర్ వడివడిగా ఎదిగేస్తోంది. ఇలాంటి సమయంలో అభిమానులు అతడి గతాన్ని తవ్వి తీస్తూనే ఉన్నారు. ఆ గతం గతుకుల మయం. ఎగుడు దిగుడు ప్రేమకథల మయం.
ఆలియాతో పెళ్లికి ముందు, ఒకప్పుడు రణబీర్ తన ప్లేబాయ్ ఇమేజ్ తో యువతుల హృదయాలను గెలుచుకున్నాడు. రణబీర్ ఒకేసారి నలుగురు అమ్మాయిలతో డేటింగ్ చేశాడని అతడి తండ్రి రిషి కపూర్ ఒకసారి వెల్లడించాడు. దీపిక పదుకొనేతో ప్రేమలో ఉన్నప్పుడే, కత్రినతోను డేట్ చేసాడు. మొదట్లో దీపికా పదుకొనేతో అతడి సంబంధం గురించి చాలా ప్రచారం సాగింది. పిచ్చిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అందరూ ఈ జంటకు పెళ్లవుతుందని భావించారు. దీపిక ఆర్.కే పేరు మీద టాటూ కూడా వేయించుకుంది. అయితే అనూహ్యంగా బ్రేకప్ అయింది. అదే సమయంలో కత్రినతో రణబీర్ డేటింగ్ చేయడంతో దీపిక కినుక వహించింది. కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేసినా కానీ ఆ సంబంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆ తర్వాత అతడు `బ్రహ్మాస్త్ర` సెట్స్‌లో అలియా భట్‌తో ప్రేమలో పడ్డాడు. చివరికి పెళ్లితో సెటిలయ్యాడు.
అయితే దీపిక, కత్రిన కంటే ముందు అతడు మరొక అందాల భామను ప్రేమించాడు. అతడు కథానాయిక అనుష్క శర్మకు ప్రపోజ్ చేసాడు. కానీ ఈ బ్యూటీ అతడిని తిరస్కరించింది. అనుష్క - రణ్‌బీర్ 2016లో విడుదలైన `ఏ దిల్ హై ముష్కిల్`లో నటించారు. వారు మంచి స్నేహితులు. ఇద్దరి మధ్యా ఆఫ్ ద స్క్రీన్ స్నేహం చాలా చర్చకు వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో అతడు అనుష్క శర్మతో ప్రేమలో ఉన్నాను అని కూడా అంగీకరించాడు. అనుష్క శర్మ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకుని లైఫ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. 2021లో వామిక 2024లో అకాయ్ ఈ జంటకు జన్మించారు. ఆలియా -రణబీర్ గురించి తదుపరి సంజయ్ లీలా భన్సాలీ చిత్రం, లవ్ అండ్ వార్‌లో కలిసి కనిపిస్తారు. విక్కీ కౌశల్ ఇందులో మరో కథానాయకుడు.
