ఈ నటుడు పాన్ ఇండియా గేమ్ ఛేంజర్?
ముఖ్యంగా ధూమ్ ఫ్రాంఛైజీ స్టార్లను ఎలివేట్ చేస్తుంది. మొదటి భాగంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రతో జాన్ అబ్రహాం హైలైట్ అయ్యాడు.
By: Tupaki Desk | 3 Jun 2025 2:00 PM ISTభారతదేశంలో బాలీవుడ్ హిస్టారికల్ ఫేజ్ గురించి తెలిసిందే. ఖాన్‌ల త్రయం తర్వాత రేసులో ఎవరున్నారు? అంటే.. ప్రస్తుత సన్నివేశంలో అక్షయ్, అజయ్ దేవగన్, హృతిక్ లతో పాటు, రణబీర్ కపూర్ మాత్రమే పెద్ద హీరోల రేసులో ఉన్నాడు. రణ్‌వీర్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ లాంటి యువహీరోలు ఆశించిన స్థాయిలో విజయాల్ని తమ ఖాతాలో వేసుకోలేక సతమతమవుతున్నారు. అదే సమయంలో రణబీర్ కపూర్ `యానిమల్` గ్రాండ్ సక్సెస్ తో రేసులోకి దూసుకొచ్చాడు. అతడు వరుసగా రామాయణం, యానిమల్ సీక్వెల్ చిత్రాలతో స్టార్ డమ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికి తోడు యష్ రాజ్ ఫిలింస్ ధూమ్ 4లో రణబీర్ ని కీలక పాత్రకు ఎంపిక చేయడం అతడి ఇమేజ్ ని మరింత పెంచనుందని అంచనా వేస్తున్నారు. బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో రణబీర్ లో కొత్త కోణం బయటపడుతుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా ధూమ్ ఫ్రాంఛైజీ స్టార్లను ఎలివేట్ చేస్తుంది. మొదటి భాగంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రతో జాన్ అబ్రహాం హైలైట్ అయ్యాడు. ధూమ్ బంపర్ హిట్ అయింది. ఆ తర్వాత ధూమ్ 2లో ప్రతినాయక పాత్రలో హృతిక్ రోషన్ హృదయాలను కొల్లగొట్టాడు. అటుపైనా ధూమ్ 3లో అమీర్ ఖాన్ లాంటి దిగ్గజ నటుడు విలన్ గా తన అద్భుత నటనతో మురిపించాడు.
ఇప్పుడు ఫ్రాంఛైజీలో ఈ నాలుగో సినిమాని 1000 కోట్ల క్లబ్ లో నిలబెట్టడం ద్వారా యష్ రాజ్ ఫిలింస్ తన హవా తగ్గలేదని నిరూపించాలని తపిస్తోందిట. వార్ 2 తర్వాత ధూమ్ ఫ్రాంఛైజీపైనే ఈ సంస్థ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అయితే షారూఖ్ తో పఠాన్ 2, ఆలియాతో ఆల్ఫా వంటి చిత్రాల్ని కూడా ఈ బ్యానర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అదే సమయంలో రణబీర్ తో సినిమాపైనా ఫోకస్ ఎక్కువగా పెడుతోంది.
ప్రతిష్ఠాత్మక ధూమ్ 4 కోసం ఆదిత్య చోప్రా- శ్రీధర్ రాఘవన్ పంతంతో ఉండటం రణబీర్ కి కలిసొచ్చే అంశం. ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడి ప్రకారం.. ధూమ్ 4 విడుదలయ్యాక, రణబీర్ స్థాయి అమాంతం పెరుగుతుంది. అతడి స్టార్ డమ్ ఆకాశమే హద్దుగా విస్తరిస్తుందని అంచనా వెలువరించారు. హిందీ పరిశ్రమలో ఖాన్‌లను పూర్తిగా కపూర్ లు డామినేట్ చేసే శకాన్ని అతడు ఆవిష్కరిస్తాడని అంచనా వేస్తున్నారు.
