Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్' ర‌ణ‌బీర్ లుక్ వెన‌క సీక్రెట్

సందీప్ రెడ్డి వంగా `యానిమల్` సంచ‌ల‌న విజ‌యం సాధించడ‌మే గాక‌, ర‌ణ‌బీర్ కెరీర్ గ్రాఫ్ ని అమాంతం మార్చేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Jun 2025 9:26 AM IST
యానిమ‌ల్ ర‌ణ‌బీర్ లుక్ వెన‌క సీక్రెట్
X

సందీప్ రెడ్డి వంగా `యానిమల్` సంచ‌ల‌న విజ‌యం సాధించడ‌మే గాక‌, ర‌ణ‌బీర్ కెరీర్ గ్రాఫ్ ని అమాంతం మార్చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌విజయ్ సింగ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటన మ‌న‌సులు గెలుచుకుంది. ముఖ్యంగా పొడ‌వాటి గిర‌జాల జుట్టు, గ‌డ్డంతో ర‌ణ‌బీర్ చాలా స్టైలిష్ గా క‌నిపించాడు. అయితే ఈ హెయిర్ స్టైల్ విష‌యంలో తొలుత సందీప్ వంగా చాలా అభ్యంత‌రం చెప్పాడ‌ట‌. ఇది కూడా `సంజూ` లుక్ లా ఉంద‌ని అన్నాడ‌ట‌. అప్ప‌టికే సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ లో ర‌ణ‌బీర్ అలా క‌నిపించడంతో వంగా క‌న్విన్స్ కాలేదు.

కానీ సెల‌బ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ ఆలిమ్ హ‌కీమ్ సందీప్ వంగాను క‌ష్టంగా ఒప్పించాడు. ర‌ణ్ విజయ్ సింగ్ పాత్ర‌కు ఈ లుక్ వంద‌శాతం సూట‌వుతుంద‌ని ఒప్పించాడ‌ట‌. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా `యానిమల్` సినిమాలో రణ్‌బీర్ కపూర్ పాత్రకు పొడవాటి జుట్టు, గడ్డం ఉంచ‌డానికి మొదట సంశయించారని వెల్లడించారు. సందీప్ లుక్ పాత్ర ప్రభావాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించింది కాబట్టి అతడిని ఒప్పించాల్సి వచ్చిందని ఆలిమ్ వివరించారు. పొడవాటి జుట్టు, గడ్డం లేకుండా ర‌ణ్ విజ‌య్ పాత్ర అంత శక్తివంతంగా ఉండేది కాదు. కానీ వంగా సర్ మొదట్లో ఆ పొడవాటి జుట్టు పనికిరాదని, సంజు లాగా కనిపిస్తున్నాడని అన్నారు. సంజయ్ దత్ బయోపిక్‌లో అతడు ఎలా కనిపించాడో వివ‌ర‌ణ ఇస్తూ చివ‌రికి ఒప్పించాన‌ని ఆలిమ్ తెలిపారు.

త‌న తండ్రి, సంఘంలో ప‌వ‌ర్‌ఫుల్ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ బ‌ల్బీర్ సింగ్ ని కాపాడుకునేందుకు ర‌ణ్ విజ‌య్ సింగ్ ఎలాంటి హింసాత్మ‌క మార్గాన్ని ఎంచుకున్నాడో యానిమ‌ల్ లో చూపించాడు సందీప్ వంగా. త‌న దూర‌పు బంధువు, త‌న సోద‌రుడు అయిన అబ్రార్ హ‌క్ నుంచి త‌న తండ్రికి ఎదురైన ప్రాణ‌హాని నుంచి శ‌త్రువుల్ని ఎదుర్కొని ఎలా కాపాడాడు? అన్న‌ది తెర‌పైనే చూడాలి. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు ఈ సినిమా ఒక మ‌చ్చుతునక. విమ‌ర్శ‌ల‌తో సంబంధం లేకుండా సాధార‌ణ ప్ర‌జ‌లు థియేట‌ర్ల‌కు త‌ర‌లి వ‌చ్చారు. త‌దుప‌రి స్పిరిట్ త‌ర్వాత యానిమ‌ల్ సీక్వెల్ చిత్రాన్ని కూడా సందీప్ వంగా తెర‌కెక్కించ‌నున్నాడు.