Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : రొమాంటిక్ పెళ్లిరోజు ఫోజ్‌

తాజాగా వీరిద్దరూ మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఏప్రిల్‌ 14న వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు.

By:  Tupaki Desk   |   15 April 2025 12:52 PM IST
Ranbir And Alia Bhatt Romantic Pic Viral
X

బాలీవుడ్‌లో మోస్ట్‌ రొమాంటిక్ కపుల్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో రణబీర్ కపూర్‌, ఆలియా భట్ జోడీ ఉంటుంది అనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా వీరిద్దరికి మంచి పాపులారిటీ ఉంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వీరు ఇద్దరు సక్సెస్ ఫుల్‌ స్టార్స్‌గా దూసుకు పోతున్నారు. ఇద్దరికి ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ బిజీ స్టార్స్‌గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరు సుదీర్ఘ కాలం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రహా అనే కూతురు కూడా ఉంది. ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఆ పాప ఉంటుంది అంటూ బాలీవుడ్ మీడియా వర్గాల్లో టాక్ నడుస్తూ ఉంటుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వీరిద్దరు ఎప్పటికప్పుడు రొమాంటిక్ కపుల్‌గానే గుర్తింపు దక్కించుకుంటూ ఉన్నారు.


తాజాగా వీరిద్దరూ మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఏప్రిల్‌ 14న వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరు వార్షికోత్సవంను ప్రత్యేక వేడుక జరుపుకుని ఎంజాయ్‌ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రొమాంటిక్ గా ఉన్న ఈ స్టిల్‌ సోషల్‌ మీడియాను కుదిపేస్తోంది. తక్కువ సమయంలోనే వైరల్‌ అయింది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను ఈ ఫోటో చెప్పకనే చెబుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఆలియా భట్‌ ఈ ఫోటోను షేర్ చేసింది. హోం, ఎల్లప్పుడు హ్యాపీ అంటూ మూడో వార్షికోత్సవం సందర్భంగా హ్యాపీ 3 అనే హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేసింది. లవ్‌ ఈమోజీతో పాటు, క్యూట్‌ ఈమెజీని షేర్ చేసి తన ప్రేమను వ్యక్తం చేసింది. మొత్తానికి సోషల్‌ మీడియాలో ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రణబీర్‌ కపూర్ ఈ సెల్ఫీని తీసినట్లుగా ఉంది. కెమెరా వైపు ఆయన చూస్తూ ఉండగా, అతడి ఒడిలో ఆలియా భట్‌ తన్మయత్వంలో మునిగి ఉంది. సినిమాలోని రొమాంటిక్ స్టిల్‌ మాదిరిగా, ఐకానిక్‌ ఫోజ్ మాదిరిగా ఈ స్టిల్‌ ఉంది.

రణబీర్‌ కపూర్ యానిమల్‌ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. త్వరలోనే యానిమల్‌ పార్క్ అంటూ సీక్వెల్‌ను చేయబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు రామాయణం సినిమాను చేస్తున్నాడు. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న రామాయణం సినిమాలో రణబీర్‌ కపూర్‌ రాముడి పాత్రలో నటిస్తూ ఉండగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో రణబీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ కలిసి 'లవ్‌ అండ్‌ వార్‌' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోగా విక్కీ కౌశల్‌ నటిస్తున్నాడు. సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.