నైట్ సీన్స్ లో బాలీవుడ్ జంట బిజీ
ఈ రియల్ లైఫ్ దంపతుల మధ్య కొన్ని ఇంటెన్స్ సన్నివేశాలను తెరకెక్కించే పనిలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
By: Tupaki Desk | 30 April 2025 10:14 PM ISTబాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్ జంటగా నటిస్తున్న లవ్ అండ్ వార్ షూటింగ్ శరవేగంగా కొనసాగతోంది. ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ అనివార్య కారణాల వల్ల మూడు నెలల పాటూ వాయిదా పడడం తెలిసిందే. ప్రస్తుతం రణ్‌బీర్-ఆలియా పైన సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతున్నట్టు బాలీవుడ్ టాక్. ఈ రియల్ లైఫ్ దంపతుల మధ్య కొన్ని ఇంటెన్స్ సన్నివేశాలను తెరకెక్కించే పనిలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే గుర్‌గావ్‌లోని ఫిలీం సిటీ జోకర్ మైదాన్‌లో రాత్రి పూట షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. సాయంత్రం ఆరు గంటలకు మొదలవుతున్న షూటింగ్ ఉదయం ఐదు గంటల వరకు నాన్ స్టాప్‌గా జరుగుతుందని తెలుస్తోంది. రణ్‌బీర్-ఆలియా మధ్య నైట్ టైమ్ షూట్ చేస్తున్న హై ఎమోషనల్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలవనున్నాయని సమాచారం. రణ్‌బీర్-ఆలియా నడుమ భారీ డైలాగ్‌లు, ఉద్వేగమైన, రొమాంటిక్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్‌లో రణ్‌బీర్-ఆలియా ఒకరితో ఒకరు పోటిపడి నటించారని, ఈ వారాంతం వరకు ఫిలీం సిటీలోనే ఈ షెడ్యూల్‌ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత కొన్ని ఇండోర్ సీన్స్‌ను మరో సెట్‌లో చిత్రీకరించనున్నారు. 2024 నవంబరులో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌కు మధ్యలో చాలా అవాంతరాలు వచ్చాయి. వాస్తవానికి వచ్చే ఏడాది రంజాన్ కు ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ మధ్యలో మూడు నెలలు షూటింగ్‌కు గ్యాప్ రావడంతో వచ్చే ఏడాది ఆగస్టులో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
రణ్‌భీర్, ఆలియా, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టులోని ఇండిపెండెన్స్ వీక్‌లో రిలీజ్ చేస్తే మరింత మైలేజ్ వస్తుందని చిత్ర బృందం భావిస్తుందట.
