Begin typing your search above and press return to search.

రానా రాక్షస రాజులో సూపర్ స్టార్..?

దగ్గుబాటి రానా హీరోగా తేజ డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాక్షస రాజు. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేశారు

By:  Tupaki Desk   |   25 Jan 2024 9:58 AM GMT
రానా రాక్షస రాజులో సూపర్ స్టార్..?
X

దగ్గుబాటి రానా హీరోగా తేజ డైరెక్షన్ లో వస్తున్న సినిమా రాక్షస రాజు. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేశారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ దగ్గుబాటి ఫ్యాన్స్ ని అలరిస్తుంది. సినిమాలో రానాతో పాటుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్నారని టాక్. సినిమాలో రానా బావ పాత్రలో మోహన్ లాల్ కనిపిస్తారని తెలుస్తుంది.

రాక్షస రాజు కథ కూడా బావా బామ్మర్దుల కథతోనే తెరకెక్కిస్తున్నరట తేజ. బావ ఆనందం కోసం ఏదైనా చేసే బామ్మర్ది పాత్రలో తేజ కనిపిస్తారట. బావకి అధికారం కట్టబెట్టి ఆయన కళ్లల్లో ఆనందం చూసేందుకు బామ్మర్ది ఏదైనా చేస్తాడట. ఈ కథతోనే రాక్షస రాజు సినిమా వస్తుందని అంటున్నారు. సినిమాలో రానా బావ పాత్రలో మోహన్ లాల్ ని ఫిక్స్ చేశారట.

సొంత భాష మలయాళంలో ప్రయోగాలు చేస్తూ ఎలాంటి కథలో అయినా ఎలాంటి పాత్రలో అయినా తన విలక్షణ నటనతో మెప్పించే మోహన్ లాల్ తేజ డైరెక్షన్ లో వస్తున్న రాక్షస రాజు సినిమాతో కూడా ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నారు. ఆల్రెడీ తేజ డైరెక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసిన రానా ఆ సినిమాతో హిట్ అందుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు రాక్షస రాజు చేస్తున్నాడు.

తేజ లాస్ట్ ఇయర్ అహింస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అహింస పోయినా సరే తేజ తేజాకి మళ్లీ అవకాశం ఇచ్చాడు రానా. కథ, కథనం బాగా రావడంతోనే ఈ సినిమాతో తేజా ని నమ్మడానికి సిద్ధమయ్యారట రానా. ఈ సినిమాతో పాటుగా రానా లైన్ లో మరో రెండు భారీ సినిమాలు కూడా ఉన్నాయి. కాస్టింగ్ విషయంలో లీడ్ పెయిర్ తప్ప మిగతా వారందరినీ తేజ కొత్త వారికే ప్రాధాన్యత ఇస్తాడు. కానీ రాక్షస రాజు కథ హీరోతో పాటు మరో బలమైన పాత్ర కూడా ఉండడంతో మోహన్ లాల్ ని ఆ రోల్ కి ఎంపిక చేశారట. మలయాళంలో తన సినిమాలు చేస్తూ మిగతా భాషల్లో ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా నో అనకుండా చేస్తున్నారు మోహన్ లాల్. మరి రానాతో కలిసి చేస్తున్న ఈ రాక్షస రాజులో ఆయన మార్క్ ఎలా చూపిస్తారన్నది చూడాలి.