Begin typing your search above and press return to search.

రాక్షస రాజా.. అలాంటి బ్యాక్ డ్రాపా?

రానా దగ్గుబాటి హీరోగా సెలక్టివ్ గా మూవీస్ చేస్తూ ఉంటారు. బాహుబలి 2 తర్వాత 2017 నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు మాత్రమే చేశాడు

By:  Tupaki Desk   |   17 Dec 2023 4:54 AM GMT
రాక్షస రాజా.. అలాంటి బ్యాక్ డ్రాపా?
X

రానా దగ్గుబాటి హీరోగా సెలక్టివ్ గా మూవీస్ చేస్తూ ఉంటారు. బాహుబలి 2 తర్వాత 2017 నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు మాత్రమే చేశాడు. అందులో విరాటపర్వం, భీమ్లా నాయక్, అరణ్య సినిమాలు ఉన్నాయి. ఈ మూడు కూడా ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. అయితే రానా పెర్ఫార్మెన్స్ కి మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

గత ఏడాది భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ ఏడాది అయితే రానా నుంచి ఒక్క సినిమా కూడా థియేటర్స్ లోకి రాలేదు. అయితే తాజాగా తేజా దర్శకత్వంలో రాక్షస రాజా అనే సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి మూవీతో రానా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు.

ఆ సినిమా తర్వాత తేజకి కూడా సక్సెస్ లు లేవు. మళ్ళీ వీరిద్దరూ కలిసి రాక్షర రాజా సినిమాతో హిట్ కొట్టాలని పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారు. ఈ సినిమా స్టోరీకి సంబంధించి ఇంటరెస్టింగ్ బజ్ నడుస్తోంది. 1930 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ నడుస్తుందంట. ఆ టైంలో ఉండే ఒక గ్యాంగ్ స్టార్ స్టోరీగా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే నిజమైతే కచ్చితంగా ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. బ్రిటిష్ రూలింగ్ సమయంలో అంటే స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టాలు కూడా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్టోరీ బ్యాక్ డ్రాప్ ఏది తీసుకున్న ఫిక్షనల్ కి రియల్ ఇన్సిడెంట్స్ జోడిస్తే డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.

మరి తేజా ఈ సినిమాతో ఎలాంటి కథని చెప్పాలని అనుకుంటున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ జోనర్ కాబట్టి అప్పటి వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా సెట్స్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరి రాక్షర రాజాగా రానా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటాడు అనేది వేచి చూడాలి.